KTR:'చలో మేడిగడ్డ'.. కార్యక్రమానికి పిలుపునిచ్చిన కేటీఆర్!

మేడిగడ్డ డ్యామేజ్ ఇష్యూలో నిజాలేంటో ప్రజలకు తెలియాలన్నారు కేటీఆర్. ఇందుకోసం మార్చి 1నుంచి 'చలో మేడిగడ్డ' కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. రెండు విడతల్లో కాళేశ్వరం ప్రాజెక్టును సమగ్రంగా సందర్శిస్తామని ఆయన స్పష్టం చేశారు.

New Update
KTR:'చలో మేడిగడ్డ'.. కార్యక్రమానికి పిలుపునిచ్చిన కేటీఆర్!

Madigadda: మేడిగడ్డ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తమపై కావాలనే బురద జల్లుతుందన్నారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్. ఇందులో నిజమెంతో, అబద్ధాలేంటో ప్రజలకు తెలియాలని చెప్పారు. ఇందులో భాగంగానే మార్చి 1నుంచి చలో మేడిగడ్డ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. మొత్తం 150-200 మంది బీఆర్‌ఎస్‌ ప్రతినిధులతో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.

రెండు విడతల వారీగా..
ఈ మేరకు తెలంగాణ భవన్‌లో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ భవన్‌ నుంచి మేడిగడ్డ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నట్లు తెలిపారు. ఈ ప్రొగ్రామ్ లో భాంగంగా తొలిరోజు కాళేశ్వరం వెళ్తామని చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారానే కాళేశ్వరం ప్రాజెక్టు సమగ్ర స్వరూపాన్ని తెలంగాణ ప్రజలతో పాటు ఆరోపణలు చేస్తున్న వారి కళ్లకు కట్టినట్లు చూపిస్తామన్నారు. ప్రజలకు నిజాలు తెలిపేందుకే మేడిగడ్డకు వెళ్తున్నామని, కాళేశ్వరం ఏంటే ఏంటో సజీవంగా చూపిస్తామన్న ఆయన.. రెండు విడతల వారీగా కాళేశ్వరం ప్రాజెక్టును సమగ్రంగా సందర్శించనున్నట్లు పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Telangana : మహాలక్మి పథకంలో మరో రెండు గ్యారంటీలకు ఉత్తర్వులు జారీ!

ప్రజలకు చెప్పదలచుకున్నాం..
‘కాళేశ్వరం అంటే ఏమిటో రాష్ట్ర ప్రజలకు ఈ రోజు చెప్పదలచుకున్నాం. తెలిసీ తెలియక మాట్లాడుతున్న వారికి సజీవంగా చూపెట్టాలని మేడిగడ్డకు బయలుదేరి వెళ్తున్నాం. కేసీఆర్‌ నల్లగొండ బహిరంగ సభలోనే స్పష్టంగా చెప్పారు. మీరు వెళ్లడం కాదు.. మేడిగడ్డకు.. అన్నారం వెళ్తాం.. సుందిళ్ల వెళ్తాం.. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు సమగ్ర స్వరూపాన్ని ప్రజలకు అర్థమయ్యేలా సజీవంగా చూపెడతామన్నారు. కాళేశ్వరం అంటే మేడిగడ్డ కాదు మూడు బరాజ్‌లు. కాళేశ్వరం అంటే 15 రిజర్వాయర్లు, 21 పంప్‌హౌస్‌లు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల ప్రవాహ కాలువలు. కాళేశ్వరం అంటే 141 టీఎంసీల స్టోరేజ్‌ కెపాసిటీ.. 240 టీఎంసీల వినియోగం. వీటన్నింటి సమగ్ర సమాహారమే కాళేశ్వరం ప్రాజెక్టు’ అని ఆయన వివరించారు.

చిల్లరగా మాట్లాడొద్దు..
అలాగే రూ.లక్షకోట్ల విలువైన ప్రాజెక్టు అని ఒక వైపు చెబుతూ.. రూ.లక్షకోట్లు కొట్టుకుపోయిందని మరోవైపు కొందరు చిల్లర మాటలు మాట్లాడుతున్నారిన మండిపడ్డారు. రూ.3వేలకోట్ల బరాజ్‌ను అందులో 84 పిల్లర్లు ఉంటే.. మూడు పిల్లర్లకు ప్రమాదం వస్తే మొత్తం బరాజ్‌ కొట్టుకుపోయిందని చిత్రీకరిస్తున్నారన్నారు. కాళేశ్వరం అంటే మేడిగడ్డ కాదు. అన్నింటింకి మించి 40లక్షలకుపై చీలుకు ఎకరాలకు నీర్చి కామధేనువు కాళేశ్వరం అని ఆయన చెప్పారు. 88మీటర్ల ఎత్తు నుంచి సముద్రమట్టం మీద 618 మీటర్ల ఎత్తుకు గోదావరి గంగను పైకి ఏటికి ఎదురీదుతూపైకి తీసుకొని పోయే బృహత్తర కార్యక్రమం కాళేశ్వరం. తెలంగాణ టోఫోగ్రఫీకి తెలిసిన వారికి తెలుస్తుంది. తెలంగాణ దాదాపు ఒక గుడిసెలా ఉంటుంది. మధ్య హయ్యర్‌ ప్లాటో ఉంటే ఒక వైపు కృష్ణ, ఒక వైపు గోదావరి ప్రవహిస్తుంటుంది. పైన 535 మీటర్లపైన హైదరాబాద్‌లాంటి పట్టణం ఉంది. కొండపోచమ్మసాగర్‌ ప్రాంతం 618 మీటర్లు ఎత్తు, లక్ష్మీదేవిపల్లి, షాద్‌నగర్‌ ఏరియాలో658 మీటర్లు. ఏటవాలుగా ఉండే పరిస్థితి తెలంగాణది’ అంటూ ఆయన చెప్పుకొచ్చారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు