Dehydration: వింటర్‌లో కూడా మంచినీళ్లు మస్ట్‌.. అసలు నెగ్లెక్ట్‌ చేయవద్దు..!

మన శరీరం 70 శాతం నీటితోనే ఉంటుంది. మన బాడీ సక్రమంగా పనిచేయాలంటే రోజూకి ఎక్కువ నీరు తీసుకోవాలని వైద్యులు చెబుతారు. చ‌లికాలంలో నీరు ఎక్కువగా తాగకపోతే డీహైడ్రేష‌న్ వస్తుందటున్నారు. దీంతో తలనొప్పి, గ్యాస్, కడుపునొప్పి, అజీర్తి, మ‌ల‌బ‌ద్ధకం వంటి సమస్యలు వస్తాయి.

New Update
Dehydration: వింటర్‌లో కూడా మంచినీళ్లు మస్ట్‌.. అసలు నెగ్లెక్ట్‌ చేయవద్దు..!

Dehydration: మనం రోజూకి ఎక్కువ నీరు తీసుకోవాలని వైద్యులు చెబుతున్న విషయం తెలిసిందే. మన శరీరం సక్రమంగా పనిచేయాలంటే నీరు చాలా ముఖ్యం. మన శరీరం 70 శాతం నీటితోనే ఉంటుంది. మన అవ‌య‌వాల‌న్నీ స‌వ్యంగా ప‌నిచేయాలంటే శ‌రీరానికి హైడ్రేష‌న్ చాలా అవ‌స‌రం. శ‌రీర ప‌నితీరు సరిగా ఉండేందుకు క‌ణాలు, అవ‌య‌వాలు, టిష్యూస్ నీటిని తీసుకుని శారీర‌క ధ‌ర్మం స‌వ్యంగా ఉండేలా చేస్తుంది. చాలా మంది ఎండాకాలంలోనే నీరు బాగా తీసుకుంటారు. ఆ తర్వాత త‌గినంత నీరు తాగ‌డంలో నిర్లక్ష్యం ఎక్కువ చేస్తారు. సీజన్‌తో సంబంధం లేకుండా బాడీని డీహైడ్రేట్‌ కాకుండా చూసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: భయం వేసినప్పుడు మన శరీరంలో ఏయే మార్పులు జరుగుతాయో తెలుసా?

అయితే.. నోరు త‌డారిపోవ‌డం, నిస్సత్తువ‌, తీవ్ర అల‌స‌ట‌, మూత్రం త‌క్కువ‌గా వస్తే హైడ్రేష‌న్ ల‌క్షణాలు ఉన్నట్టు. దీనిని ప‌సిగ‌డుతూ త‌గినంత నీరు తీసుకోవాలని వైద్యులు అంటున్నారు. కాగా.. చ‌లికాలంలో కొద్దిగా నీరు తీసుకున్నా.. ఒకేసారి తాగకుండా రోజంతా అప్పుడప్పుడు నీరు తాగాలి. డీహైడ్రేష‌న్‌ తగ్గాలంటే రోజుకు నాలుగు క‌ప్పుల గ్రీన్‌టీ, రెండు బౌల్స్ సూప్ తీసుకుంటే మంచిదంటున్నారు. దీంతోపాటు ఉదయం గోరువెచ్చని నీటిలో తేనె, నిమ్మరసం కలిపి తాగితే.. అజీర్తి, మ‌ల‌బ‌ద్ధకం నుంచి బయటపడి శ‌రీరం హైడ్రేట్‌గా ఉంచుకోవచ్చు. అంతేకాకుండా జ‌లుబు, ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్లతో పోరాడి ఇమ్యూనిటీ పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

శీతాకాలంలో డీహైడ్రేషన్‌ ప్రమాదాలు ఎక్కువ

చాలామంది ఒకరోజు ఆహారం తినకుండా ఉంటారు. కానీ.. నీరు లేకుండా ఒక్కరోజు కూడా ఉండలేరు. చాలా మందికి చలికాలంలో నీటి దాహం అర్థం కాదు. శీతాకాలంలో ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉండి.. శరీరం పొడిగా అవుతుంది. కొందరూ ఆహారం తిన్న తర్వాత కూడా నీరు తాగడం మర్చిపోతారు. దీంతో శీతాకాలంలో డీహైడ్రేషన్‌ ప్రమాదాలు వస్తాయి. మన శరీరంలో నీటిశాతం తగ్గితే మూత్ర విసర్జన సమస్య వస్తుంది. ఆ సమయంలో చికాకు, వెనునొప్పి, అసౌకర్యం, మూత్రనాళం డ్రైగా మారిపోతుంది. అంతేకాదు మలబద్ధకం సమస్య ఉన్నవారు నీళ్లు ఎక్కువగా తాగడం అలవాటు చేసుకోవాలి. శరీరంలో అన్ని విషపదార్థాలను నీరు బయటకు పంపుతుంది. నీరు తాగకుండానే శరీరంలో టాక్సిన్స్‌ పేరిగి, మొటిమల సమస్యలు, ఆహారం జీర్ణం కాకపోవడం, గ్యాస్, కడుపునొప్పి వంటి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

Advertisment
తాజా కథనాలు