ఫ్రెంచ్ ఓపెన్ (French Open 2024) సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత ప్లేయర్లు పీవీ సింధు(PV Sindhu) , కిదాంబి శ్రీకాంత్ (Kidhambi Srikanth) విజయంతో శుభారంభం చేశారు. ఇద్దరు తొలి రౌండ్‌లోనే విజయం సాధించారు. ఈ టోర్నీలో ప్రణయ్ మొదటి రౌండ్ లోనే ఔటయ్యాడు. పీవీ సింధు తొలి రౌండ్ లో కెనడా క్రీడాకారిణి మిచెల్ లీ తో పోరాడి విజయం సాధించి రెండో రౌండ్ కు చేరుకుంది. ఈ మ్యాచ్ లో లీ సింధుకి గట్టి పోటీనే ఇచ్చింది. అయితే సింధు ఆట ముందు కాస్త నెమ్మదిగా సాగినా.. తరువాత ప్రత్యర్థికి చుక్కలు చూపించి.. 20-22, 22-20, 21-19తో గెలుపొందింది.
పురుషుల సింగిల్స్ లో కిదాంబి శ్రీకాంత్ కూడా తన ప్రతిభ చూపించి విజయం సాధించాడు. చైనీస్ తైపీకి చెందిన చౌ టియెన్ చెన్ పై అద్బుత విజయాన్ని నమోదు చేశాడు. పారిస్ ఒలింపిక్స్ కి అర్హత సాధించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న శ్రీకాంత్ కు ఇది మూడో విజయం. సుమారు 66 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్ లో 21-15, 20-22, 21-8 తేడాతో విజయం సాధించాడు. 2021 ప్రపంచ ఛాంపియన్‌షిప్ రజత పతక విజేత శ్రీకాంత్ రెండో రౌండ్‌లో చైనాకు చెందిన 17వ ర్యాంక్ ప్రపంచ ఆటగాడు లు గువాంగ్ జుతో తలపడనున్నాడు.
ఇక ప్రణయ్( Pranay) మొదటి రౌండ్ లోనే గ్వాంగ్ జు తో జరిగిన మ్యాచ్ లో ఓడిపోయి వెనుదిరిగాడు. చాలా సేపు ఇద్దరి మధ్య ఆసక్తికరమైన మ్యాచ్ జరిగింది. పేలవమైన గేమ్ తో ప్రణయ్ ఓడిపోయాడు. గ్వాంగ్ జు 19-14 స్కోరుతో విజయానికి చేరువలో ఉన్నప్పటికీ ప్రణయ్ వరుసగా మూడు పాయింట్లు సాధించి మ్యాచ్‌ను ఆసక్తికరంగా మార్చాడు. గువాంగ్ జు శక్తివంతమైన స్మాష్‌ని ప్రణయ్ తలపై కొట్టాడు. ఈ స్కోరుతో అతను మ్యాచ్‌ను గెలుచుకున్నాడు.
Also read: కేవలం ఒక గిన్నె సలాడ్ చాలు… వేలాడే కొవ్వును ఇట్టే కరిగిస్తుంది..తినడానికి బెస్ట్ టైమ్ ఏంటంటే!