Warangal : ఈ నెల 15 నుంచి 25 వరకు మేడారం జాతరలో ఉచిత వైఫై

ఫిబ్రవరి 21 నుంచి మొదలయ్యే మేడారం జాతరకు తెలంగాణ ప్రభుత్వం విస్తృతంగా ఏర్పాట్లు చేస్తోంది. కోటి మంది భక్తులు హజరవుతారని అంచనా. అందుకే ఈ జాతరకు వచ్చే వారికి ఉచిత వైపై ఇవ్వాలని డిసైడ్ అయింది బీఎస్ఎన్ఎల్. ఈ నెల 15 నుంచి 25 వరకు మేడారంలో ఉచిత వైపై సేవలు అందిస్తోంది.

Telangana: రేపు సూళ్ళకు సెలవు..ఆ ఒక్క జిల్లాలో మాత్రమే
New Update

Sammakka-Saralakka Jatara : ఆసియా(Asia) ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర(Sammakka-Saralakka Jatara). నాలుగు రోజుల పాటు సాగనున్న ఈ జాతరకు దేశ, విదేశాల నుంచి దాదాపు కోటి మంది వరకు భక్తుల వరకు వస్తారని అంచనా. గిరిజనులు ప్రధానంగా ఆరాధించే దేవతలు మేడారం(Medaram) సమ్మక్క- సారలమ్మ. ప్రతి రెండేళ్లకోసారి మాఘ పౌర్ణమికి ముందు నాలుగురోజుల పాటు ఈ మహా జాతర జరుగుతుంది. ఈ నెల 21 నుంచి 24 వరకు ఈ జాతర జరగనుంది. అమ్మవార్లు గద్దెల మీద కొలువుతీరిన రోజు నుంచి కోట్లాది మంది గిరిజనులు, గిరిజనేతరులు తమ మొక్కులు చెల్లించుకోవడానికి వస్తారు. పసుపు కుంకుమలను, వొడి బియ్యాన్ని, బంగారాన్ని (బెల్లం) సమర్పిస్తారు. కోడి పుంజులు, మేకపోతులను బలి ఇస్తారు.

Also Read:Warangal:వరంగల్‌లో వ్యక్తి ప్రాణం తీసిన చిట్టీలు

ఉచిత వైఫై ఏర్పాటు..

మేడారం జాతకు తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) ఇప్పటికే ఎన్నో ఏర్పాట్లను చేసింది. భక్తుల సౌకర్యాల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. రవానా, భోజనం, మంచినీరు లాంటి వాటితో పాటూ ఇప్పుడు ఉచిత వైఫై(Free Wi-fi) ను కూడా భక్తులకు అందించాలని డిసైడ్ అయింది. దీని కోసం బీఎస్ఎన్ఎల్‌(BSNL) ను రంగంలోకి దింపింది. ములుగు జిల్లాలోని అటవీ ప్రాంతంలో జరిగే ఈ జాతరలో కమ్యూనికేషన్ లేక భక్తులు తరుచూ ఇబ్బందులు పడుతుంటారు. ఇక మీదట అలా జరగకూడదని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ప్రభుత్వరంగ సంస్థ అయిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) మేడారం మహాజాతరలో మెరుగైన సేవలందించేందుకు సిద్ధమైంది. జాతరలో సిగ్నలింగ్ వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు భక్తులకు ఉచిత వైఫై సేవలందించేందుకు కసరత్తు చేస్తోంది.

తాత్కాలిక టవర్లు...

భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే 16 ప్రాంతాల్లో ఉచిత వైఫై సేవలను వినియోగించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వరంగల్ నుంచి మేడారం వెళ్లే మార్గంలోని పస్రా, వెంగళాపూర్, ప్రాజెక్టునగర్, నార్లాపర్, మేడారం ఇంగ్లీష్ మీడియం స్కూల్ వద్ద పర్మినెంట్ స్ట్రక్షర్లు ఏర్పాటు చేసింది. వీటితో పాటూ ములుగు సమీపంలోని గట్టమ్మ ఆలయం, ఊరట్టం క్రాస్ రోడ్డు, కొత్తూరు, రెడ్డిగూడెం, జంపన్నవాగు, కాజ్ వే, మేడారం సమ్మక్క గద్దెలు, ఆర్టీసీ బస్టాండ్, గెస్ట్ హౌజ్ వద్ద ఈ తాత్కాలిక టవర్లను ఏర్పాటు చేస్తోంది.

16 ప్రాంతాల్లో హాట్ స్పాట్ సెంటర్లు...

ములుగు ఎంట్రన్స్ లోని గట్టమ్మ గుడి, కొత్తూరు రోడ్‌, కొత్తూరు స్కూల్‌, ఊరట్టం క్రాస్ రోడ్డు, కాజ్‌వే, రెడ్డిగూడెం స్కూల్‌, హరిత హోటల్‌, నార్లాపూర్‌, ఇంగ్లిష్‌ మీడియం స్కూల్‌, ఐటీడీఏ గెస్ట్‌ హౌస్‌, బస్టాండ్‌, వాచ్‌ టవర్‌, ఆసుపత్రుల వద్ద ఒక్కొక్కటి, జంపన్నవాగు, ఆర్టీసీ బస్టాండ్‌, మేడారం అమ్మవారి గద్దెల ప్రాంతాల్లో హాట్‌ స్పాట్‌లు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. ఈ హాట్ స్పాట్ సెంటర్లకు వంద అడుగుల లోపు ఏ నెట్ వర్క్ వినియోగదారులైనా సులభంగా లాగిన్ అయి వైఫై సేవలు వినియోగించుకోవచ్చు. 10 నుంచి 20 ఎంబీపీఎస్‌ స్పీడ్‌తో వన్ జీబీ వరకు డేటా వాడుకోవచ్చు.

మూడు టీమ్‌లు...

అంతేకాదు బీఎస్ఎన్ఎల్ కు సంబంధించిన అన్ని రకాల సేవలను పర్యవేక్షించేందుకు మూడు టీములను కూడా ఏర్పాటు చేశారు అధికారులు. మూడు టీముల్లో 20 మంది అధికారులు, సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉంటారు. జాతర అయ్యేంత వరకు కనెక్టివిటీ, సిగ్నలింగ్ వ్యవస్థలో లోపాలు తలెత్తకుండా పర్యవేక్షిస్తారు.

Also Read : ఈపీఎఫ్ వడ్డీ రేట్లు పెరుగుతాయా..లేదా? తేలేది ఆరోజే!

#free-wifi #warangal #sammakka-saralakka #medaram-jatara
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe