Hyderabad: ఎన్నికల వేళ రొడ్డెక్కిన డబుల్ డెక్కర్ బస్సులు.. ప్రయాణం ఉచితం..

హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్ చుట్టూ తిరుగుతున్న డబుల్‌ డెక్కర్ ఎలక్ట్రిక్ బస్సులో.. సందర్శకులు, వివిధ ప్రాంతాల నుంచే పర్యాటకులు ఇక ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. సంజీవయ్యపార్కు, జలవిహార్‌, అంబేడ్కర్‌ 125 అడుగుల విగ్రహం తదితర ప్రాంతాలను సందర్శించవచ్చు.

New Update
Hyderabad: ఎన్నికల వేళ రొడ్డెక్కిన డబుల్ డెక్కర్ బస్సులు.. ప్రయాణం ఉచితం..

హైదరాబాద్‌లో కొత్త ఎలక్ట్రిక్ డబులు డెక్కర్ బస్సులు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇవి కొద్ది రోజులుగా హుస్సేన్‌సాగర్ చుట్టు మాత్రమే పరుగులు తీస్తున్నాయి. సందర్శకులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే టూరిస్టులు ఇక ఇందులో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. గత ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన 'అంతర్జాతీయ ఫార్మలా ఈ' పోటీల సందర్భంగా HMDA ఈ డబుల్ డెక్కర్ ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేసింది. అయితే ఒక్కో బస్సుకు రూ.2.5 కోట్ల చొప్పున మొత్తం మూడు బస్సులను తీసుకొచ్చారు. అయితే చాలారోజుల వరకు పార్కింగ్‌కే పరిమితం అయిపోయాయి.

నగరంలో ఈ బస్సులను అందరికీ అందుబాటులో తీసుకొచ్చేందుకు కొన్ని సర్వేలు చేసినప్పటికీ కూడా ఇంకా సరైన రూట్లు ఖరారు కాలేదు. దీంతో ఇన్నిరోజులు పార్కింగ్‌కే పరిమితమైన ఈ బస్సులను ప్రస్తుతం హుస్సేన్‌సాగర్‌ చుట్టూ తిప్పుతున్నారు. అయితే ఈమధ్య అంబేడ్కర్‌ విగ్రహం, అమరుల స్మారకం ఏర్పాటు చేసిన తర్వాత నెక్లెస్‌ రోడ్డుకు వచ్చే సందర్శకుల రద్దీ చాలా పెరిగిపోయింది. నగరంలో ఉండేవాళ్లు మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు అలాగే విదేశీ టూరిస్టులు సైతం.. నెక్లెస్‌రోడ్డు, ట్యాంక్‌బండ్‌, పరిసర ప్రాంతాలను సందర్శించేందుకు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే సాగర్‌ చుట్టూ ఉన్న అన్ని ప్రాంతాలను సందర్శించేందుకు ఈ డబుల్‌ డెక్కర్‌ బస్సులు ఎంతో ప్రయోజనకరంగా ఉన్నాయి.

ప్రస్తుతం సాగర్‌ చుట్టూ ఈ మూడు బస్సులు తిరుగుతున్నాయి. సంజీవయ్యపార్కు, థ్రిల్‌సిటీ, లేక్‌ఫ్రంట్‌ పార్కు, జలవిహార్‌, నీరాకేఫ్‌, పీపుల్స్‌ప్లాజా, అంబేడ్కర్‌ 125 అడుగుల విగ్రహం తదితర ప్రాంతాలను సందర్శించిన అనంతరం సెక్రటేరియట్‌కు వెళ్లవచ్చు. అక్కడి బస్సు దిగి కొద్ది సేపు అమరుల స్మారకాన్ని సందర్శించి తిరిగి మళ్లీ బస్సుల్లోనే ట్యాంక్‌బండ్‌ వైపు వెళ్లొచ్చు. ఆ తర్వాత ట్యాంక్‌బండ్‌ మీదుగా తిరిగి సంజీవయ్య పార్కుకు ఈ బస్సులు చేరుకొంటాయి. బస్సు పై అంతస్తులో కూర్చొని ఈ రూట్‌లో ప్రయాణం చేయడం గొప్ప అనుభూతినిస్తుంది.

Also Read: నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ.. ఎస్సీ వర్గీకరణపై కీలక ప్రకటన ?

ఇక బస్సుల పనివేళల సంగతి చూస్తే.. ప్రతి రోజు ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు హుస్సేన్‌సాగర్ చుట్టూ తిరగొచ్చు. సాయంత్రం 5 గంటల నుంచే ఎక్కువ మంది ప్రయాణికులు డబుల్‌ డెక్కర్‌ సేవలను వినియోగించుకుంటున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. మరోవైపు శని, ఆదివారాలు, ఇతర సెలవు రోజుల్లోనూ డబుల్‌ డెక్కర్‌లకు డిమాండ్‌ ఉంటుందని అంటున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు