దీపావళి పండుగ వేళ ఉచితంగా మద్యం, పటాకులు..ఎక్కడో తెలుసా!

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఓటర్లను ఆకర్షించేందుకు రామగుండానికి చెందిన కొంత మంది అభ్యర్థులు ఉచితంగా టపాసులు, మద్యం అందిస్తున్నట్లు సమాచారం.

దీపావళి పండుగ వేళ ఉచితంగా మద్యం, పటాకులు..ఎక్కడో తెలుసా!
New Update

దీపావళి పండుగ అంటేనే సరదాల పండుగ...పిన్నలు పెద్దలు అనే తేడా లేకుండా ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. ప్రతి ఇంటలో కూడా బాంబులు మోగాల్సిందే. అలాంటి దీపావళి పండుగ నాడు మందుబాబులు ఓ చుక్కేసి పటాకులు కాల్చితే ఇక ఎలా ఉంటుంది చెప్పడానికి కూడా మాటలు రావు.

తెలంగాణలోని రామగుండంలో దీపావళి పండుగను కార్మికులు అందరూ ఆనందంగా జరుపుకోవాలని సింగరేణి యాజమాన్యం దీపావళి బోనస్‌ కింద నెలనెలా కార్మికులకు భారీ ఆఫర్‌ ఇస్తుంది. ప్రస్తుత కాలంలో పెరుగుతున్న ఎవరికైనా సరే బాంబులు కొనాలంటే..ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. కానీ ఈ ఏడాది పటాకులు పెద్దగా కొనాల్సిన పని లేదు.

అసలే ఎన్నికల సమయం కావడంతో ఓటర్లను ఎలా మచ్చిక చేసుకోవాలో అని అభ్యర్థులు ఆలోచిస్తున్నారు. ఈ సమయంలో దీపావళి రావడం వారికి బాగా కలిసి వచ్చిందనే చెప్పవచ్చు. ఎందుకంటే టపాసులు బయట కొనాలంటే మినిమం రూ. 1000 లేనిదే రావడం లేదు. ఈ విషయాన్ని బాగా గుర్తించిన రాజకీయ పార్టీల నాయకులు తమ డివిజన్ల పరిధిలోని ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు టపాసులు గాలం వేస్తున్నారు.

రామగుండం నియోజకవర్గంలో గత రెండు రోజుల నుంచి అభ్యర్థుల అనుచరులు తమకు ఓటేసేవారు ఎవరో ముందుగానే గుర్తించి వారికి నేరుగా బాంబులను నజరానాగా అందిస్తామని ముందే మాట తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు బిర్యానీలు, ఐస్‌ క్రీములు మాత్రమే ఫ్యామిలీ ప్యాక్‌ లు ఉండేవి..ఇప్పుడు తాజాగా పటాసులు కూడా చేరాయి.

ఒక్కో కుటుంబానికి ఫ్యామిలీ ప్యాకేజీ కింద పటాకులు కుటుంబానికి పంపుతున్నారు. అయితే అభ్యర్థుల ఎన్నికల ఖర్చుల పై ఎన్నికల కమిషన్‌, రిటర్నింగ్‌ అధికారులు తీవ్రంగా నిఘా పెంచడంతో అనుచరులు కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. ఇదిలా ఉంటే ముందుగానే మద్యం షాపుల వ్యాపారులతో ఒప్పందం కుదుర్చుకొని టోకెన్‌ పద్దతిలో తమ ఓటర్లు వస్తే ఉచితంగా మద్యం కూడా ఇవ్వాలని టోకెన్‌ సిస్టంకు తెరలేపినట్లు సమాచారం.

Also read: దీపావళి రోజున ఎన్ని దీపాలు వెలిగించాలో తెలుసా..అవి ఎక్కడ ఉంచాలంటే!

#telangana #elections #ramagundam #offers #deepavali
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe