Andhra Pradesh: పేదలకు ఆసరగా 'రవిప్రకాష్ సిలికానాంధ్ర సంజీవని' హాస్పిటల్.. ఏపీలోని కృష్ణా జిల్లా కూచిపూడి గ్రామంలో ఏర్పాటు చేసిన రవిప్రకాష్, సిలికానాంధ్రా సంజీవని హాస్పిటల్.. పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తూ విజయవంతంగా నడుస్తోంది. ఈ హాస్పిటల్‌కు ప్రస్తుతం ప్రతిరోజూ 300 మంది ఓపీ పేషెంట్స్ వస్తున్నారు. మరిన్ని వివరాల కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 29 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి ఏపీలోని కృష్ణా జిల్లా కూచిపూడి గ్రామంలో ఏర్పాటు చేసిన రవిప్రకాష్, సిలికానాంధ్రా సంజీవని హాస్పిటల్ (SiliconAndhra Sanjivani Hospital).. పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తూ విజయవంతంగా నడుస్తోంది. 2018లో దసరా పర్వదినాన ప్రారంభించిన ఈ హాస్పిటల్‌కు ప్రస్తుతం ప్రతిరోజూ 300 మంది ఓపీ పేషెంట్స్ వస్తున్నారు. కూచిపూడి చుట్టుపక్కల ఉన్న 50 గ్రామాల నుంచి ఇక్కడ వైద్య సదుపాయం పొందుతున్నారు. అత్యాధునిక టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్స్, దేశంలోనే మొట్టమొదటి హై టెక్నాలజీ ఎక్స్ రే ల్యాబ్‌తో ఇక్కడ పేదలకు ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. రవిప్రకాష్.. సిలికాన్ ఆంధ్ర సీఈవో కూచిపట్ల ఆనంద్‌తో కలసి కూచిపూడిలో ఈ హాస్పిటల్ ప్రారంభించారు. దీని నిర్మాణం కోసం రవి ప్రకాష్ ఫండ్ రైసింగ్ చేశారు. ఆయన టీవీ9 సీఆవోగా పనిచేస్తున్న సమయంలో.. ఛానల్‌లో రెండు రోజుల పాటు నిర్విరామంగా ఎలాంటి యాడ్స్ ఇవ్వకుండా కేవలం ఈ సంజీవని హాస్పిటల్ కోసం ఫండ్ రైజింగ్ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే కూచిపూడి పరిసర ప్రాంతాల్లో నాణ్యమైన వైద్య సదుపాయం అందుబాటులో లేకపోవడం.. పేదరికం ఎక్కవగా ఉండటం వల్లే అక్కడ ఈ హాస్పిటల్‌ను ప్రారంభించారు. Also Read: తెలంగాణలో ఒక్క హాస్టల్‌కి కూడా రిజిస్ట్రేషన్ లేదు.. మరోవిషయం ఏంటంటే హాస్పిటల్‌కు వచ్చే రోగులతో పాటు వారి తరఫున వచ్చే అటెండర్‌కు కూడా భోజన సదుపాయం కల్పిస్తున్నారు. ఉచిత ఓపీతో పాటు.. మందులు కూడా ఉచితంగా అందిస్తున్నారు. ఉచితంగా ఇలాంటి మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించడం వల్ల మాలాంటి పేదవాళ్లకి ఎంతో మేలు జరుగుతుందని అక్కడికి వస్తున్న రోగులు చెబుతున్నారు. గతంలో విజయవాడ, మచిలీపట్నం వెళ్లాల్సి వచ్చేదని.. ప్రస్తుతం కూచిపూడిలోనే రవి ప్రకాష్ సిలికానంద సంజీవిని హాస్పిటల్‌లోనే అత్యాధునిక వైద్య సదుపాయాలు అందుకుంటున్నామని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ హాస్పిటల్‌లో ప్రవేట్ హాస్పిటల్‌ను మించిన స్థాయిలో సదుపాయాలు ఉండటం విశేషం. ప్రతి వార్డులో కూడా పేషెంట్ కోసం అత్యంత ఖరీదైన బెడ్స్‌ను ఏర్పాటు చేశారు. మొత్తం ఐదు ఫ్లోర్‌లతో నిర్మించిన ఈ హాస్పిటల్.. ప్రస్తుతం రెండు ఫ్లోర్‌లలోనే పనిచేస్తుంది. నిధుల కొరత కారణంగా మూడు, నాలుగు ఫ్లోర్లో నిర్మాణాలు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రస్తుతం దాతల సహకారం కోసం ఎదురుచూస్తున్నారు. కృష్ణాజిల్లాలో ఎక్కడ లేని విధంగా అత్యాధునిక ఐదు ఆపరేషన్ థియేటర్లు నిర్మాణ దశలో ఉన్నాయి. ఆర్థోపెడిక్, న్యూరో, చిన్నపిల్లల వైద్యుడు, దంత వైద్యుడు, గైనకాలజిస్ట్ విభాగాల్లో నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉన్నారు. ప్రస్తుతం 24 గంటలపాటు వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. Also Read: అమరావతిలో ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాలు నోటిఫై చేస్తూ గెజిట్ జారీ #telugu-news #ravi-prakash #ravi-prakash-siliconandhra-sanjivani #free-health-care మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి