TET: టెట్ అభ్యర్థులకు బంపర్ ఆఫర్.. టి-సాట్ లో ఫ్రీ క్లాసులు!

టెట్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు టీ-సాట్ శుభవార్త చెప్పింది. మార్చి 21న 3 నుంచి 4 గంటల వరకూ అనుభవం కలిగిన ఫ్యాకల్టీచే ఫ్రీ క్లాసులు చెప్పింబోతున్నట్లు సీఈవో వేణుగోపాల్ తెలిపారు. సందేహాలకు టోల్ ఫ్రీ నెం: 040 23540326,726, 1800 425 4039

New Update
TET: టెట్ అభ్యర్థులకు బంపర్ ఆఫర్.. టి-సాట్ లో ఫ్రీ క్లాసులు!

Free Classes For TS TET: టెట్ పరీక్షకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు టీ-సాట్ (T-SAT)  శుభవార్త చెప్పింది. యూట్యూబ్, తదితర వేదికల్లో డబ్బులు చెల్లించి క్లాసులకు హాజరవుతున్న అభ్యర్థులకు ఉచితంగా క్లాసులు చెప్పేందుకు సిద్ధమైంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వo నిర్వహించబోయే టెట్ (టీచర్స్ ఎలిజబిలిటి టెస్ట్) పరీక్షపై అవగాహన కల్పించేందుకు టి-సాట్ నెట్వర్క్ ఛానళ్లు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి తెలిపారు.

ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం..
ఈ మేరకు బుధవారం విడుదల చేసిన పత్రిక ప్రకటనలో ఈ నెల 21వ తేదీ గురువారం మధ్యాహ్నాం 3 గంటల నుండి 4 గంటల వరకు టి-సాట్ నిపుణ ఛానల్ లో ప్రత్యేక ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు వివరించారు. అనుభవం కలిగిన ఫ్యాకల్టీచే నిర్వహించే లైవ్ కార్యక్రమాల్లో మొదటి రోజు కెమిస్ట్రీ సబ్జెక్ట్ పై అవగాహన కార్యక్రమం ఉంటుందని సీఈవో స్పష్టం చేశారు. పది రోజుల పాటు పది సబ్జెక్టులపై జరిగే ప్రత్యేక ప్రత్యక్ష్య ప్రసార కార్యక్రమాల్లో టెట్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమ అనుమానాలను నివృత్తి చేసుకోవాలని సూచించారు.

ఇది కూడా చదవండి: Sajjala: షర్మిలకు మాఫియా ముఠాతో సంబంధాలున్నాయి.. సజ్జల సంచలన కామెంట్స్!

సందేహాలు తీరుస్తారు..
లైవ్ ప్రసారాలతో పాటు రికార్డింగ్ పాఠ్యాంశాలు టి-సాట్ నిపుణ ఛానళ్లతో పాటు టి-సాట్ యాప్, యూట్యూబ్ లోనూ అందుబాటులో ఉంటాయని తెలిపారు. అభ్యర్థులు తమ తమ సందేహాలను తీర్చుకుంటూ సమాధానాలు పొందేందుకు 040 23540326,726 టోల్ ఫ్రీ 1800 425 4039 నెంబర్లకు కాల్ చేయాలని సీఈవో వేణుగోపాల్ రెడ్డి సూచించారు.

Advertisment
తాజా కథనాలు