AP: పెళ్లి పేరుతో మహిళల మోసం.. వివాహితను పెండ్లికుమార్తెగా చూపించి..

కాకినాడలో పెళ్లి పేరిట మహిళలు చేసిన మోసం వెలుగులోకి వచ్చింది. కృష్ణమోహన్‌ అనే వ్యక్తికి వివాహిత నీరజను పెండ్లికుమార్తెగా చూపించారు. ఆమె నచ్చడంతో నిశ్చితార్థం చేసుకోవాలని కృష్ణమోహన్‌ రూ. 6 లక్షలు, బంగారు గొలుసు అందజేశాడు. విషయం తెలుసుకున్న బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

AP: పెళ్లి పేరుతో మహిళల మోసం.. వివాహితను పెండ్లికుమార్తెగా చూపించి..
New Update

Kakinada: పెళ్లి పేరుతో ఆరుగురు మహిళలు ఓ వ్యక్తిని భారీ మోసం చేశారు. వివాహితను పెండ్లికుమార్తెగా చూపించి నగదు కాజేశారు. అసలు విషయం వెలుగులోకి రావడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వివరాల్లోకి వెళ్లితే, కాకినాడలో శిరీష అనే మహిళ.. పెద్ద మార్కెట్ కు చెందిన టి. కృష్ణమోహన్ కు పెళ్లి సంబంధం చూస్తానని అన్నారు.

Also Read: రియల్‌ఎస్టేట్‌ వ్యాపారిని దారుణంగా మోసం చేసిన ముఠా.. రూ. 5 కోట్లు అప్పు ఇస్తామని చెప్పి.!

జూన్ 23న మధ్యవర్తులుగా సత్యవేణి, దుర్గ అనే ఇద్దరిని పరిచయం చేశారు. అదే రోజు ఆయనను వారు రాజమహేంద్రవరం శివారులోని నామవరం తీసుకెళ్లి నీరజ అనే మహిళను పెండ్లి కుమార్తెగా చూపించారు. ఆమెకు తల్లిగా సత్యదేవి, అత్తగా ప్రియాదేవిని పరిచయం చేశారు. పెండ్లి కుమార్తె అతడికి నచ్చడంతో నిశ్చితార్థం చేసుకోవాలని నిర్ణయించి ఖర్చుల నిమిత్తం కృష్ణమోహన్ రూ. 6 లక్షలు, ఓ సెల్ ఫోన్, బంగారు గొలుసు సత్యదేవి, ప్రియాదేవికి అందజేశాడు.

Also Read: గురుకుల స్కూల్‌లో వరుస విషాదాలు.. ఉన్నట్టుండి చనిపోతున్న విద్యార్థులు.. అసలేం జరుగుతుంది?

అయితే, ఎందుకో కొద్దిరోజులకు అతడికి అనుమానం వచ్చి ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వారంతా మోసగత్తెలని తెలిసింది. పెండ్లి కూమార్తెగా ఉన్న నీరజకు అప్పటికే పెళ్లయి సంతానం కూడా ఉన్నట్లు తేలింది. దీంతో తాను మోసపోయానని గుర్తించిన బాధితుడి పోలీసులను ఆశ్రయించాడు. ఘటనపై అధికారులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆ మహిళలపై పూర్తిగా దర్యాప్తు చేపట్టారు.

#ap-news #kakinada
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe