Jagtial District: గురుకుల స్కూల్ అంటే పేద తల్లిదండ్రులు ఎంతో ఆసక్తి చూపుతారు. తమ పిల్లలను ఆ స్కూల్ లో చేర్పిస్తే విద్యాబుద్ధులతో పాటు ఆటపాటలతో ఎంతో సంతోషంగా ఉంటూ మంచిగా ఎదుగుతారు అనే నమ్మకం. కానీ ఆ స్కూల్లో ఏం జరుగుతుందో ఏమో.. విద్యార్థులు వరుసగా చనిపోతున్నారు. మరి కొంత మంది విద్యార్థులు అనారోగ్యం బారినపడుతున్నారు. 15 రోజుల క్రితం ఇద్దరు పిల్లలను పాము కాటేసింది.. అందులో ఒకరు చనిపోయారు.. ఇంకొకరు చికిత్స తీసుకోని ప్రాణాలతో బయటపడ్డారు. అంతేకాకుండా, పాటు కాటు వేసిన రూములోనే పడుకున్న మరో విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది.
పూర్తిగా చదవండి..Crime News: గురుకుల స్కూల్లో వరుస విషాదాలు.. ఉన్నట్టుండి చనిపోతున్న విద్యార్థులు.. అసలేం జరుగుతుంది?
జగిత్యాల జిల్లా పెద్దాపూర్ ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్లో వరుస విషాద ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అనిరుద్ అనే విద్యార్థి మృతి చెందాడు. మరో ఇద్దరు విద్యార్థులు అనారోగ్యం బారిన పడ్డారు. 15 రోజుల క్రితం ఇదే స్కూల్లో ఒక విద్యార్థి మృతి చెందగా.. మరో ఇద్దరు పాముకాటుకు గురైయ్యారు.
Translate this News: