Chandrababu Case: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పిటిషన్లు నాలుగు పిటిషన్లు నేడు విజయవాడ ఏఈసబీ కోర్టులో (ACB Court) విచారణకు రానున్నాయి. ఫైబర్ నెట్ స్కామ్ కేసులో (Fiber Net Scam) చంద్రబాబును పిటి వారెంట్ పై ఇవ్వాలని సిఐడి తరుపున న్యాయవాదులు వేసిన పిటిషన్ మీద కూడా ఈరోజు ఏసిబి కోర్టులోవిచారణ జరుగుతుంది.
రాజమండ్రి సెంట్రల్ చంద్రబాబు హెల్త్ రిపోర్ట్ కుటుంబ సభ్యులకు ఇవ్వడం లేదని ఏసిబి కోర్టు లో చంద్రబాబు తరుపున న్యాయవాదులు వేసిన పిటిషన్ మీద కూడా ఈ రోజే విచారణ జరుగుతుంది.
చంద్రబాబును అరెస్ట్ చేసిన సమయంలో వచ్చిన సిఐడి (AP CID) అధికారుల కాల్ లిస్ట్ ఇవ్వాలని ఎసిబి కోర్టు లో చంద్రబాబు నాయుడు తరుపున న్యాయవాదుల వేసిన పిటిషన్, దాంతో పాటూ ఇప్పటికే ఈ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేసిన సిఐడి తరుపున న్యాయవాదుల పిటిషన్ రెండింటి మీదా ఏసీబీ కోర్టు విచారణ చేయనుంది. రాజమండ్రి సెంట్రల్ జైల్ లో చంద్రబాబుతో న్యాయవాదులు రోజుకు రెండుసార్లు ములాఖాత్ జైలును ఒక రోజుకు కుదించడం పై చంద్రబాబు నాయుడు తరుపున న్యాయవాదులు వేసిన పిటిషన్ పై ఎసిబి కోర్టు లో విచారణ చేయనున్నారు. దీంతో ఈరోజు టీడీపీ అధినేతకు కీలకం కానుంది.
Also Read:చంద్రబాబు అరెస్ట్, ఓటుకు నోటు కేసుపై హరీశ్ రావు సంచలన కామెంట్స్!
మరోవైపు ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు (Chandrababu) వేసిన ఎస్ఎల్పీ కూడా నేడు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. ఇదే పిటిషన్‌ను ఏపీ హైకోర్టు (AP High Court) కొట్టేసింది. దాన్ని సవాలు చేస్తూనే బాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 13న విచారణ ఈకేసు విచారణకు వచ్చినప్పుడు 18వ తేదీ వరకు ఉపశమనం ఇచ్చారు. తరువాత దాన్ని 17వ తేదీకి వాయిదా వేశారు. అయితే ఆరోజు కేసు వాదన వచ్చేటప్పటికి కోర్టు సమయం ముగియడంతో ఈ రోజుకు తిరిగి వాయిదా పడింది. ఈ కేసులో ధర్మాసనం విచారణ చేసే వరకు బాబును అరెస్ట్ చేయోద్దంటూ కోర్టు ఆదేశించింది. దీంతో ఈరోజు విచారణకు ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇక స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో 17ఏ మీద బాబు తరుపు న్యాయవాదులు వేసిన ఇరు పక్షాల లిఖిల పూర్వక వాదనలు దాఖలు చేయడానికి ఈరోజే ఆఖరి రోజు. ఈ కేసులో మంగళవారమే వాదనలు ముగిసినా లిఖిత పూర్వక వాదనల కోసం తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది. ఈ రోజు తరువాత ఈనెల 29 వరకు కోర్టు సెలవులు అవ్వడంతో ఈ కేసు తీర్పు కూడా ఈ రోజు వెలువరింఏ అవకాశం ఉంది. ఈరోజు లేకపోతే మళ్ళీ 30వ తేదీన కోర్టు పునఃప్రారంభం అయ్యాకనే తీర్పు వెలువరించే అవకాశం ఉంది.
Also Read: పవన్ రాజకీయాలకు అన్ ఫిట్ : మంత్రి అంబటి