ఫ్లైట్‌ జర్నీ చేసేవారికి గుడ్‌ న్యూస్‌..శంషాబాద్‌ నుంచి మరో 4 విమానాలు!

శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి 4 కొత్త విమాన సర్వీసులను నడుపుతున్నట్లు విమానాశ్రయాధికారులు వివరించారు. ఈ సర్వీసులను అందించడానికి ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ ముందుకు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

New Update
ఫ్లైట్‌ జర్నీ చేసేవారికి గుడ్‌ న్యూస్‌..శంషాబాద్‌ నుంచి మరో 4 విమానాలు!

హైదరాబాద్‌ లోని శంషాబాద్‌ రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రస్తుతం అనేక దేశాలకు విమాన సర్వీసులు నడుస్తున్నాయి. కొద్ది రోజుల క్రితమే విమానాశ్రయంలో కొత్త టెర్మినల్‌ ను ప్రారంభించారు. ఇదిలా ఉంటే ఆర్జీఐఏ అధికారులు మరో గుడ్‌ న్యూస్‌ తెలిపారు. ఈ విమానాశ్రయం నుంచి మరో నాలుగు కొత్త విమాన సర్వీసులను నడపనున్నట్లు అధికారులు వివరించారు.

ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సహకారంతో ఈ విమానాలు ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయి. కొచ్చి, గ్వాలియర్‌, అమృత్‌సర్‌, లక్నో లకు కనెక్ట్‌ చేస్తున్నట్లు అధికారులు వివరించారు. ఈ విషయాన్ని శంషాబాద్‌ విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. శుక్రవారం నుంచి అమృత్‌సర్‌, లక్నో, కొచ్చిలకు సర్వీసులు ప్రారంభించినట్లు జీఎంఆర్‌ హైదరాబాద్‌ అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌ సీఈవో ప్రదీప్‌ పణిక్కర్‌ తెలిపారు.

గ్వాలియర్‌ నవంబర్‌ 28 నుంచి ప్రారంభమవుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను అందించడం కోసం ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. అమృత్‌సర్‌కు వెళ్లే ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానం ప్రతిరోజూ ఉదయం 7.30 గంటలకు శంషాబాద్‌ నుంచి బయల్దేరి 10.15 గంటలకు చేరుకుంటుందని ఆయన చెప్పారు.

కొచ్చికి వెళ్లే విమానం ప్రతిరోజూ రాత్రి 7.45 గంటలకు శంషాబాద్‌ నుంచి బయల్దేరి రాత్రి 9.30 గంటలకు కొచ్చి కి చేరుకుంటుంది. శంషాబాద్‌ - లక్నో మధ్య వారానికి ఆరు సర్వీసులు ఉంటాయని అధికారులు తెలిపారు. ఇక్కడి నుంచి మధ్యాహ్నం 2.30 గంటలకు బయల్దేరి 4.35 గంటలకు లక్నోకి చేరుకుంటుంది.

శంషాబాద్‌ - గ్వాలియర్‌ మధ్య వారానికోసారి మూడు సర్వీసులను నడుపుతున్నట్లు అధికారులు వివరించారు,. ఈ విమాన సర్వీసులు శంషాబాద్‌ లో మధ్యాహ్నం 2.30 గంటలకు బయలుదేరి 4.20 గంటలకు గ్వాలియర్ చేరుకుంటుంది.

Also read: హైదరాబాద్ లో పెను విషాదం.. స్కూల్ బస్సు కింద పడి మూడేళ్ల చిన్నారి మృతి!

Advertisment
Advertisment
తాజా కథనాలు