Telangana : రేషన్ కార్డ్ కేవైసీ చేయించారా.. అయితే త్వరపడండి.. గడువు దగ్గరపడుతోంది.

మీరు తెలంగాణలో ఆరు గ్యారెంటీలకు దరఖాస్తు చేసుకున్నారా? అయితే మరి రేషన్ కార్డు కోసం కేవైసీ చేయించారా? లేదా? చేయకపోతే వెంటనే చేయించుకోండి. లేదంటే మీ రేషన్ కార్డు రద్దయ్యే ప్రమాదం ఉంది.

Telangana : రేషన్ కార్డ్ కేవైసీ చేయించారా.. అయితే త్వరపడండి.. గడువు దగ్గరపడుతోంది.
New Update

Ration Card KYC : తెలంగాణ(Telangana) లో రేషన్ కార్డు లకు కేవైసీ(KYC) తప్పనిసరి చేసింది ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) పెట్టిన ఆరు గ్యారెంటీ లకు అప్లై చేసుకోవాలంటే రేషన్ కార్డ్(Ration Card) కేవైసీ కచ్చితంగా చేసుకోవాల్సిందే అని చెప్పింది. ఈ నెలాఖరు వరకే దీనికి గడువు ఉంది. ఇప్పటికే రేషన్ కార్డు ఉండి, మీ కుటుంబ సభ్యుల్లో మార్పులు చేర్పులు ఉంటే వెంటనే ఈ కేవైసీ చేయించుకోవాలి. ఒకవేళ చేయించుకోకపోతే గడువు పెంచుతారా? లేదా? అన్న క్లారిటీ ఇప్పటికైతే లేదు. కాబట్టి వెంటనే వెళ్లి కేవైసీ చేయించుకోండి. రేషన్ కార్డు ఉంటేనే కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీ(6 Guarantees) ల్లో మీరు దరఖాస్తు చేసిన పథకానికి మీరు అర్హులవుతారు. లేదంటే అనర్హులవుతారు.

Also Read : Bihar Politics : బీహార్‌లో కీలక మలుపు.. నితీశ్ సర్కార్ సంచలన నిర్ణయం

బోగస్ రేషన్ కార్డులను తొలగించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రేషన్ కార్డు ఉన్నవారు ఈ కేవైసీ చేసుకోవాలని స్పష్టం. ఈ ప్రక్రియ గత 5 నెలలుగా కొనసాగుతోంది. రేషన్ డీలర్లకు దగ్గరకు వెళ్లి ఆధార్ నంబర్ చెప్పి.. ఆ తర్వాత వేలిముద్రలు నమోదు చేస్తే ఈకేవైసీ పూర్తవుతుంది. రేషన్ కార్డు ఈ కేవైసీ చేసుకోకుంటే మాత్రం వారి పేరును రేషన్ కార్డు నుంచి తొలగిస్తామని స్పష్టం చేస్తున్నారు. జనవరి 31వ తేదీ లోగా రేషన్ కార్డు, ఆధార్ నంబర్ కు లింక్ చేయాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ దేవేందర్‌ సింగ్‌ చౌహాన్‌ సూచించారు. భారత ప్రభుత్వం అర్హులైన పేదలకు ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన స్కీమ్ ద్వారా రేషన్ బియ్యం, ఇతర సరకులు అందిస్తున్నారు.

అయితే రేషన్ కార్డ్ కేవైసీ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మందకొడిగా సాగుతోంది. రెండు జిల్లాల్లో 20 నుంచి 30 శాతం కార్డుదారులు కేవైసీని చేయించలేదు. దాంతో పాటూ మరణించని వారి పేర్లను, పెళ్లయిన ఆడపిల్లల పేర్లను కూడా తొలగించడం లేదు. దీంతో మరోసారి అధికారులు వేలిముద్రలను సేకరిస్తున్నారు. రేషన్ కార్డు ఈ కేవైసీతో చాలా పేర్లు తొలగించడం వల్ల ప్రభుత్వానికి డబ్బు ఆదా కానుంది.

#telangana #congress-6-guarantees #congress-government #ration-card-kyc
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe