Donald Trump Arrested: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్..!!

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ అరెస్ట్​ అయ్యారు. ఎన్నికల అవకతవకల కేసులో అధికారికంగా అరెస్టయిన తర్వాత గురువారం అట్లాంటా జైలులో లొంగిపోయారు. ఇప్పుడు ట్రంప్ మగ్ షాట్ ప్రక్రియను ఎదుర్కోవలసి ఉంటుంది. ట్రంప్ మగ్ షాట్ ఎదుర్కొన్న తొలి అమెరికా మాజీ అధ్యక్షుడు ఆయనే అవుతారు. జార్జియాలో 2020 అధ్యక్ష ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు ట్రంప్ కుట్ర పన్నారు.

Donald Trump Arrested: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్..!!
New Update

Donald Trump Arrested : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ (Donald trump arrested)​ అరెస్ట్​ అయ్యారు. ఎన్నికల అవకతవకల కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం అట్లాంటా జైలులో లొంగిపోయారు. ఇప్పుడు ట్రంప్ మగ్ షాట్ (Mug shot) ప్రక్రియను ఎదుర్కోవలసి ఉంటుంది. ట్రంప్ మగ్ షాట్‌ను ఎదుర్కొన్న తొలి అమెరికా మాజీ అధ్యక్షుడు ఆయనే కావడం విశేషం. అమెరికా చట్టాల ప్రకారం, నిందితుడి ముఖాన్ని పోలీసులు తీయడం మగ్ షాట్ అంటారు . జార్జియాలో 2020 అధ్యక్ష ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు మాజీ అధ్యక్షుడు కుట్ర పన్నిన సంగతి తెలిసిందే.

వార్తా సంస్థ రాయిటర్స్ ప్రకారం, ట్రంప్ జైలుకు చేరుకున్న వెంటనే, ట్రంప్ బ్యానర్, అమెరికా జెండాలతో డజన్ల కొద్దీ మద్దతుదారులు గుమిగూడిన సంగతి తెలిసిందే. వెలుపల గుమిగూడిన ట్రంప్ మద్దతుదారులలో జార్జియాకు చెందిన US ప్రతినిధి మార్జోరీ టేలర్ గ్రీన్, మాజీ అధ్యక్షుడికి అత్యంత నమ్మకమైన కాంగ్రెస్ సహాయకులలో ఒకరు. జార్జియాలో ట్రంప్ 13 వేర్వేరు గణనలను ఎదుర్కొంటున్నారు, ఇందులో మోసం, అసత్య సాక్ష్యం, అనేక ఇతర ఆరోపణలున్నాయి. అంతకుముందు, ట్రంప్ మాజీ సహాయకుడు మార్క్ మెడోస్ ఫుల్టన్ కౌంటీలో లొంగిపోయారు. కౌంటీ (County) వెబ్‌సైట్ ప్రకారం అతన్ని అరెస్టు చేశారు. 2020 అధ్యక్ష ఎన్నికలను తిప్పికొట్టేందుకు ట్రంప్ కుట్ర పన్నినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 18 మంది సహ-ప్రతివాదుల్లో మెడోస్ ఒకరు.

2024 అధ్యక్ష ఎన్నికలకు సిద్థమవుతున్న సమయంలో ట్రంప్​ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే నాలుగు నగరాల్లో ట్రంప్ పై ఎన్నో కేసులు నమోదు అయ్యాయి. వీటిల్లోని కొన్నింట్లో ట్రంప్ దోషిగా కూడా తేలారు. ఈ ఏడాది మార్చ్​ నుంచి ట్రంప్ కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఫ్లోరిడా, వాషింగ్​టన్​లో ఫెడరల్​ ఛార్జీలు ట్రంప్ ఎదుర్కొన్నారు. 2020 అధ్యక్ష ఎన్నికల్లో ఆర్గనైజ్​డ్​ క్రైమ్​కు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రంప్​.. ఈ నెలలోదోషిగా తేలారు. ఆయనతో పాటు మాజీ చీఫ్​ ఆఫ్​ స్టాప్​ మార్క్​ మిడోస్​(Mark Meadows), న్యూయార్క్​ మాజీ మేయర్​ రూడీ గులియాని(Rudy Giuliani)లు కూడా దోషులుగా తేలిన సంగతి తెలిసిందే.

Also Read: ఇక తగ్గేదేలే…ఎవడొస్తారో రండిరా.. ఇండియన్ ఆర్మీ అదుర్స్..!!

#donald-trumps-arrest #georgia #former-us-president-donald-trump-arrested #trump-arrested #ex-us-president-trump-arrested #donald-trump-arrested #atlanta
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe