Chinta Mohan: చంద్రబాబు కుప్పం అభివృద్ధి ఇంకెప్పుడూ.. చింతామోహన్ ఆసక్తిర వ్యాఖ్యలు!

ఏపీకి మరోసారి చంద్రబాబు సీఎం కావడం తనకు సంతోషంగా ఉందని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ అన్నారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుందన్నారు. కానీ కుప్పం అభివృద్ధికి నోచుకోవట్లేదని, ఇకనైనా దృష్టిపెట్టాలని సూచించారు.

New Update
CM Chandrababu: విభజన వల్ల ఏపీకి భారీ నష్టం జరిగింది.. దానిపై ఇంకా క్లారిటీ లేదు!

AP News: చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఏపీకి మరోసారి ముఖ్యమంత్రి కావడం సంతోషంగా ఉందని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ (Chinta Mohan) చెప్పారు. 50 ఏళ్ల క్రితం చంద్రబాబు ఈ స్థాయికి ఎదుగుతాడని తాను ఊహించలేదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ ఏపీ సీఎంతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. తిరుపతి టౌన్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా తాను, పులిచెర్ల బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా చంద్రబాబు కాంగ్రెస్ నుంచి రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టినట్లు తెలిపారు. రాష్ట్రానికి నాలుగోసారి చంద్రబాబు సీఎం అయ్యారు. ఢిల్లీలో అందరూ చంద్రబాబును బాహుబలి అంటుంటారు. ఆంధ్రప్రదేశ్ అంటే ఏపీ అంటారు. కానీ చంద్రబాబు మాత్రం పొద్దున లేస్తే, రాత్రి వరకు ఏపీ అంటే అమరావతి పోలవరం అంటాడన్నారు.

కుప్పం అభివృద్ధిపై దృష్టి పెట్టండి..
ఇక కుప్పం అభివృద్ధిపై కూడా దృష్టి పెట్టాలని, రైల్వే స్టేషన్ కు పోతే కుప్పం ఏంత అభివృద్ధి చెందిందో తెలుస్తుందన్నారు. ఇక మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారన్నారు. కానీ చంద్రబాబు శాంతి భద్రతల విషయంలో చక్కగా పనిచేస్తున్నారని కొనియాడారు. అధికారం పోయిన రెండు నెలలకే జగన్మోహన్ రెడ్డిలో ఓపిక బాగా తగ్గిందన్నారు. కుప్పం మధ్యలో ఇంటి స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించాలని డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు. తిరుపతిలో నేను 50 మంది జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇప్పించాను. దర్జాగా ఇల్లు కట్టుకున్నారు. అందులో ఒకాయన ఎమ్మెల్యే కూడా అయ్యారు. నేను రాగానే తిరుమల దర్శనం కావాలని కుప్పంలో పనిచేసే జర్నలిస్టులు నన్ను అడిగారు. అక్రిడేషన్ ఉన్న జర్నలిస్టులందరికీ తిరుమల దర్శనం కల్పించాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. అమరావతి లో 100 ఎకరాలు జర్నలిస్టులకు ఇచ్చి, తలా 10 సెంట్లు స్థలం ఇవ్వాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పరిపాలనలో చేసిన అప్పులపై ఏ జిల్లాకు ఎంత ఖర్చు చేశారో ఆ వివరాలు బయటపెట్టాలన్నారు.

Also Read: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడి.. ఇద్దరు సైనికులు మృతి!

ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఖండిస్తున్నట్లు చెప్పారు. తెలుగు వాళ్ళ పరిస్థితి అధ్వానంగా ఉంది. అప్పులు ఇవ్వండి... అప్పులు ఇవ్వండి.. అని అడుక్కుంటున్నారు. ఆ రెండు కుటుంబాల వల్ల తెలుగు వాళ్లకు చాలా నష్టం జరిగింది. ఇందిరా గాంధీ తెచ్చిన ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ను జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. చంద్రబాబు నాయుడు వెంటనే ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్లు కు నిధులిచ్చి, పునరుద్ధరించాలని కోరారు.

Advertisment
తాజా కథనాలు