Shailajanath: కూటమి అగ్రిమెంట్ ఏదో రాష్ట్ర ప్రజలకు తెలియాలి: శైలజనాథ్

అభివృద్ధి కోసమే ఒకటయ్యామని టీడీపీ- బీజేపీ- జనసేన నాయకులు చెప్పడం ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు ఏపీ పీసీసీ మాజీ అధ్యక్షుడు శైలజనాథ్. బీజేపీకి మీకు మధ్య కుదిరిన అగ్రిమెంట్ ఏదో రాష్ట్ర ప్రజలకు బహిర్గతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

Shailajanath: కూటమి అగ్రిమెంట్ ఏదో రాష్ట్ర ప్రజలకు తెలియాలి: శైలజనాథ్
New Update

AP Congress Leader Shailajanath: అభివృద్ధి కోసమే తామంతా ఒకటయ్యామని బీజేపీ టీడీపీ జనసేన నాయకులు చెప్పడం ఆశ్చర్యానికి గురి చేసిందని ఏపీ పీసీసీ మాజీ అధ్యక్షుడు శైలజనాథ్ అన్నారు. అనంతపురం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమిలో ఉన్న మూడు పార్టీలు ఒకరిపై ఒకరు గతంలో విమర్శలు చేసుకున్నారని మళ్ళీ ఇప్పుడు వారే అభివృద్ధి కోసం కలిసామని చెప్పడం హ్యాస్యాస్పదంగా ఉందన్నారు. అభివృద్ధి కోసం కాకుండా దేనికి కలిసారో చెప్పాల్సిన బాధ్యత ముగ్గురిపై ఉందన్నారు.

Also Read: గీతాంజలి సూసైడ్.. సీఎం జగన్ మాస్ వార్నింగ్

ప్రత్యేక హోదా ఇస్తామని, విశాఖ రైల్వే జోన్, విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రేవేటికరణ చేయమని, పోలవరం మేమే కట్టిస్తామని మోడీ, అమిత్ షా మీకు చెప్పారా? అని ప్రశ్నించారు. మీ మధ్య కుదిరిన అగ్రిమెంట్ ఏదో రాష్ట్ర ప్రజలకు బహిర్గతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. 400 ఎంపీ సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తామని మోడీ చెప్పారని అలాంటి వారితో టీడీపీ, జనసేన ఎలా కలుస్తుందని నిలదీశారు. ఎలెక్టోరల్ బాండ్ల అంశాన్ని పక్కదో పట్టించడానికి సిఏఏ అంశాన్ని తెరపైకి తీసుకు వచ్చారని ఆరోపించారు. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా దానిని మతాల వైపు మళ్ళించడం బీజేపీకి అలవాటు అంటూ శైలజనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

#janasena #shailajanath #tdp #bjp
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe