BRS : భూకబ్జా ఆరోపణలపై స్పందించిన మాజీ ఎంపీ సంతోష్ రావు.. ఏమన్నారంటే? తనపై వచ్చిన భూకబ్జా ఆరోపణలపై బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ రావు స్పందించారు. 2016లో తాను పూర్తిగా చట్టబద్దంగా కొనుగోలు చేసినట్లు తెలిపారు. నేను బాజాప్తా డబ్బులు పెట్టి కొన్ని ఆస్తిపై అనవసర నిందలు వేస్తూ ప్రజల్లో అపోలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. By Bhoomi 24 Mar 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Santosh Rao : మాజీ ఎంపీ సంతోష్(Ex. MP Santosh) పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్(Banjara Hills Police Station) లో కేసు నమోదు అయింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్-14లో ఫోర్జరీ డాక్యూమెంట్ల(Forgery Documents) తో భూమి కబ్జా చేశారంటూ నవయుగ కంపెనీ ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు సంతోష్ పై ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినట్లు చెప్పారు. ఈ విషయంపై బీఆర్ఎస్(BRS) మాజీ ఎంపీ సంతోష్ రావు(Santosh Rao) స్పందించారు. 2016లో తాను పూర్తిగా చట్టబద్దంగా కొనుగోలు చేసినట్లు తెలిపారు. నేను బాజాప్తా డబ్బులు పెట్టి కొన్ని ఆస్తిపై అనవసర నిందలు వేస్తూ ప్రజల్లో అపోలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. షేక్ పేటలోని సర్వే నంబర్ 129/54 లో ఉన్న 904 చదరపు గజాల ఇంటి స్థలం నేను శ్యాంసుందర్ ఫుల్జాల్ ( తండ్రి పి వి హన్మంతరావు ) అనే వ్యక్తి నుంచి 2016లో (సేల్ డీడ్ నంబర్ 5917/2016. 11 నవంబర్ 2016) పూర్తి చట్టబద్ధంగా కొనుగోలు చేశాను. రూ. 3 కోట్ల 81 లక్షల 50 వేలు చెల్లించి, బాజాప్తా సేల్ డీడ్ ద్వారా, రిజిస్ట్రేషన్ శాఖ ఆధ్వర్యంలో కొనుగోలు చేశాను. కాబట్టి ఫోర్జరీ అనే మాటకు తావులేదు . అది వాస్తవం కాదు . ఎనిమిది సంవత్సరాలుగా ఎలాంటి న్యాయవివాదం తలెత్తలేదు. నన్ను ఎవరూ సంప్రదించలేదు. నాకు ఇంటి స్థలాన్ని అమ్మిన శ్యాంసుందర్ ఆ భూమిని 1992లో సేల్ డీడ్ నంబర్ 1888/1992 ద్వారా కొనుగోలు చేశారు. అప్పటినుంచి ఎలాంటి న్యాయవివాదాలు లేవని ఆయన నాకు స్పష్టంగా తెలియజేశారు. అంటే దాదాపు 32 ఏళ్లుగా ఆ భూమిపై ఎలాంటి న్యాయవివాదాలు లేవు. నేను కొనుగోలు చేసిన తర్వాత ఆ భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. శ్యాంసుందర్, అంతకన్నా ముందు వాళ్లు చేపట్టిన నిర్మాణాలే కొనసాగుతున్నాయి. ఆ స్థలం గడిచిన 32 సంవత్సరాలుగా నాకు అమ్మిన వ్యక్తి మరియు నా ఆధీనంలోనే ఉన్నది . ఒకవేళ ఏమైనా న్యాయపరమైన అంశాలు ఉంటే ముందుగా నాకు లీగల్ నోటీసు(Legal Notice) ఇవ్వాలి. వివరణ అడగాలి. కానీ అలాంటివేమీ లేకుండా నేరుగా పోలీస్ స్టేషన్లో ఫోర్జరీ చేశామని ఫిర్యాదు చేశారు. వివాదాస్పద ఇంటి స్థలం 1350 గజాలు అని పోలీసులు, మీడియా పేర్కొంటున్నారు. కానీ నేను కొన్నది 904 గజాల ఇంటి స్థలం అని గమనించగలరు. దీనిని బట్టి ఇది కేవలం రాజకీయ దురుద్దేశంతో నమోదు చేసిన కేసు అని స్పష్టంగా అర్థమవుతుంది. నేను బాజాప్తా డబ్బులు పెట్టి కొన్న ఆస్తిపై అనవసర నిందలు వేస్తూ.. ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారు. నేను ఎలాంటి కబ్జాలకు పాల్పడలేదు. నేను కొనుగోలు చేసిన భూమిపై ఎవరైనా విచారణ చేసుకోవచ్చు. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. న్యాయపరంగా ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. 32 సంవత్సరాలుగా లేని వివాదం కొత్తగా ఇప్పుడు ఎందుకు తెర మీదికి వచ్చిందో సులభంగా అర్థం చేసుకోవచ్చు. మా పార్టీపై, నాపై రాజకీయ కక్షతో బురద జల్లాలని చూస్తే సహించేది లేదు. తప్పుడు ఆరోపణలు చేసి వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించాలని చూస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాననని తెలిపారు. ఇది కూడా చదవండి : బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్‌పై కేసు నమోదు! #brs #ex-mp #former-mp-santosh #santosh-rao మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి