Rape Case : మాజీ ఎమ్మెల్యే కూతురిపై అత్యాచారం.. రూ. 6 కోట్లు వసూల్!

యూపీలో ఓ వ్యక్తి మాజీ ఎమ్మెల్యే కూతురిపై లైంగిక దాడికి పాల్పడ్డ ఘటన సంచలనం రేపుతోంది. ఆస్తికోసం కూల్ డ్రింక్స్ లో మత్తుమందు కలిపి, తనను నగ్నంగా ఫొటోలు తీసి, బ్లాక్ మెయిల్ చేసి రూ. 6 కోట్లు వసూల్ చేశాడంటూ బాధితురాలు కంప్లైట్ చేసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

New Update
Rape Case : మాజీ ఎమ్మెల్యే కూతురిపై అత్యాచారం.. రూ. 6 కోట్లు వసూల్!

Ex. MLA Daughter : ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) రాష్ట్రంలో ఆస్తికోసం ఓ వ్యక్తి మాజీ ఎమ్మెల్యే కూతురిపై లైంగిక దాడి(Sexual Assault) కి పాల్పడ్డ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. మొరాదాబాద్ జిల్లాకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే కూతురు తనను ఓ వ్యక్తి మోసం రూ.6 కోట్లు వసూల్ చేశాడంటూ పోలీసులు ఫిర్యాదు చేసింది. ఐదేళ్లుగా నిందితుడు తన అసభ్యకరమైన ఫొటోలు చూపుతూ బ్లాక్‌మెయిల్(Blackmail) చేస్తున్నాడని, శారీరకంగా వేధిస్తున్నాడని వాపోయింది. అంతేకాదు తన తండ్రి ఆస్తులను అక్రమంగా రాయించుకునేందుకు పలుసార్లు లైంగిక దాడికూడా చేశాడని ఆరోపించింది.

ఇది కూడా చదవండి:Murder: అక్రమ సంబంధానికి అడ్డొస్తుందని నిండు గర్భావతిని చంపిన భర్త!

ఈ మేరకు తన తండ్రి మరణం తర్వాత తనకు సోదరులు లేకపోవడంతో ముగ్గురు అక్కాచెల్లెల్ల పేరు మీద ఆస్తి రాయించుకున్నట్లు తెలిపింది. అయితే తన తండ్రి ఆస్తిని లాక్కోవడానికి వేదిస్తున్నాడని, మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ తాగించి అసభ్యకర చిత్రాలను(Nude Photos) చిత్రీకరించి బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే తన అశ్లీల ఫోటోలను తొలగించడానికి దాదాపు రూ. 6 కోట్ల రూపాయలు వసూలు చేసి, ఆ ఫొటోలను తొలగించలేదని వెల్లడించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. బాధితురాలి ఆధారాలు రుజువైతే నిందితుడిని అరెస్ట్ చేస్తామని స్పష్టం చేశారు.

Advertisment
తాజా కథనాలు