Former Minister Vellampalli Srinivas : తన సీటు మార్పు వ్యవహారంపై వస్తున్న వార్తలకు సీరియస్ గా స్పందించారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్(Vellampalli Srinivas). నాకు సీటు లేదని, సీటు మారుస్తున్నారని రకరకాల వార్తలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గ అభివృద్ధి పనులకు సంబంధించి క్యాంప్ ఆఫీస్ కి నేను మేయర్ రెండు రోజులు క్రిందట వెళ్ళామని అయితే అప్పుడు సీటు మార్పు గురించి నా దగ్గర అధిష్టానం ప్రస్తావించలేదని చెప్పారు.
Also Read: మిమ్మల్ని చూస్తే గర్వంగా ఉంది..వైఎస్ షర్మిల ట్వీట్ వైరల్.!
తాను వెస్ట్ నియోజకవర్గ నుండి మళ్ళీ పోటీ చేస్తానని తేల్చి చెప్పారు. విజయవాడ సెంట్రల్ స్థానానికి వెళ్ళమన్నారు అనేది కేవలం ప్రచారం మాత్రమేనన్నారు. నేను పార్టీకి రాజీనామా చేశానని ఫేక్ వార్తలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నేను జగన్ నమ్ముకున్న వ్యక్తిని.. జగన్(YS Jagan) ఏం చెప్పినా... చేయడానికి సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. విజయవాడ మూడు నియోజకవర్గాలతో పాటు, ఎన్టీఆర్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు గెలిపించి ముఖ్యమంత్రికి బహుమతి ఇస్తామని ధీమ వ్యక్తం చేశారు.
Also Read: 20 ఏళ్లుగా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న.. ప్రధాని మోడీ