కనుసైగ చేయండి చాలు..వీరి కథ మేము చూసుకుంటాం: పరిటాల సునీత!

చిత్తూరు జిల్లా పుంగనూరులో శుక్రవారం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పై వైసీపీ వారు చేసిన దాడిని నిరసిస్తూ శనివారం టీడీపీ కార్యకర్తలు, నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు.

Paritala Sunitha: సీపీఎస్ రద్దు ఏమైంది: పరిటాల సునీత
New Update

చిత్తూరు జిల్లా పుంగనూరులో శుక్రవారం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పై వైసీపీ వారు చేసిన దాడిని నిరసిస్తూ శనివారం టీడీపీ కార్యకర్తలు, నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎక్కడికక్కడ పోలీసులు వారిని అదుపులోనికి తీసుకుని అరెస్ట్‌ లు చేశారు. ఈ క్రమంలోనే వైసీపీ దాడిని నిరసిస్తూ ఆందోళనకు దిగిన మాజీ మంత్రి పరిటాల సునీతను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

నిరసన కార్యక్రమం చేపట్టేందుకు ఎన్ఎస్‌ గేట్ వద్ద కు బయల్దేరిన పరిటాల సునీతను మరూరు టోల్‌ ప్లాజా వద్ద పోలీసులు అడ్డుకున్నారు. టోల్‌ ప్లాజా వద్ద అడ్డుకోవడంతో పరిటాల సునీత తో పాటు టీడీపీ కార్యకర్తలు, నేతుల అక్కడే రోడ్డు మీద బైఠాయించి నిరసనకు దిగారు.

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సునీత మీడియాతో మాట్లాడుతూ..చంద్రబాబు మీద రాళ్లు పడుతున్నప్పుడు ఈ పోలీసులు అందరూ ఎక్కడ ఉన్నారు. ఇప్పుడు మమ్మల్ని అడ్డుకోవడానికి మాత్రం పోలీసులు వచ్చారని ఆమె విరుచుకుపడ్డారు.

పోలీసుల తీరు పై సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలని పోలీసులే చంద్రబాబు మీద రాళ్ల దాడి చేసి వేరేవరో మీద తోసేస్తున్నారని ఆమె మండిపడ్డారు. చంద్రబాబు కానీ ఒక సైగ చేస్తే వైఎస్సాఆర్‌ గుండాలు రోడ్లు మీద తిరగలేరని ఆమె హెచ్చరించారు.

‘‘మా ప్రాణాలు పోయినా సరే.. మిమ్మల్ని రక్షించుకుంటాం. మీరు కనుసైగ చేయండి సర్.. వీరి కథ మేము చూసుకుంటాం’’ అంటూ చంద్రబాబును కోరారు.

‘‘పెద్దిరెడ్డి మీరు మీ ఇంటికి పెద్ద కావచ్చు.. మాకు కాదు. ఇప్పుడు చేస్తున్న వాటికి.. మూల్యం చెల్లించుకుంటారు’’ అని పరిటాల సునీత హెచ్చరించారు.

#ycp #tdp #arrest #andrapradesh #punganuru
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe