P. Narsa Reddy: ఇందిరాభవన్ లో మాజీ పీసీసీ అధ్యక్షుడు మాజీ మంత్రి పి. నర్సారెడ్డి (P. Narsa Reddy) సంతాప సభ నిర్వహించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, సీనియర్ నేత జానారెడ్డి, మాజీ మంత్రి వి.హనుమంత రావు, ధరణి కమిటీ సభ్యుడు కోదండ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ సభకు హాజరైయ్యారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) మాట్లాడుతూ.. నర్సారెడ్డితో తనకు ఎంతో అనుబంధం ఉందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అన్ని పదవులు చేప్పట్టిన ఏకైక వ్యక్తి అని కొనియాడారు. సిద్ధాంతం, విలువలకోసం ఆయన ఎప్పుడూ పాటు పడే వారని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో మాట్లాడి ఆదిలాబాద్ (Adilabad) జిల్లా కు ఆయన పేరు పెట్టడానికి కృషి చేస్తానని అన్నారు.
Also Read: విశాఖలో దారుణం.. పెళ్లి చేసుకోమన్న ప్రియురాలిని ప్రియుడు ఏం చేశాడంటే ?
పి.నర్సారెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవ చేశారన్నారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ (MLC Mahesh Kumar Goud) . ఆయన మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని అన్నారు. కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి మాట్లాడుతూ.. నర్సారెడ్డి రాజకీయ జీవితం, ఆయన చేపట్టిన పదవులు, అందరికి ఆదర్శమన్నారు. ఇందిరా గాంధీ ప్రవేశపెట్టిన భూ సంస్కరణలో రెవిన్యూ మంత్రిగా ఉన్నప్పుడు తన భూమిని పేదలకు త్యాగం చేసి అందరికి ఆదర్శంగా నిలిచిన గొప్ప వ్యక్తి అని కీర్తించారు. కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని పోరాడిన వ్యక్తి అని గుర్తు చేశారు.
Also Read: టీడీపీ, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు..ఇన్ని ఇవాల్సిందే అంటున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్..!
నిస్వార్థ రాజకీయాలకు పి. నర్సారెడ్డి నిలువెత్తు నిదర్శనం అన్నారు మాజీ మంత్రి జానారెడ్డి (Jana Reddy). ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే, శాసనసభ ఐక్య వేదిక ఫోరమ్ ను ఏర్పాటు చేసి, పోరాటం చేసిన గొప్ప వ్యక్తి అని వ్యాఖ్యనించారు. నిర్మల్ జిల్లాకు ఆయన పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేశారు. మాజీ ఎంపీ విహెచ్ మాట్లాడుతూ..పెదవాళ్లకు సామాజిక న్యాయం జరగాలని పోరాటం చేసిన వ్యక్తి పి. నర్సారెడ్డి అని కొనియాడారు. నర్సారెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి తాను కృషి చేస్తానని వెల్లడించారు. ఆదిలాబాద్ జిల్లాకు నర్సారెడ్డి పేరు పెట్టాలని కోరారు.