KCR RSP : ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌కు ఆ కీలక బాధ్యతలు.. కన్ఫామ్‌ చేసిన కేసీఆర్‌!

బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మాజీ IPS ప్రవీణ్‌కుమార్‌ను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. బీఎస్పీ నుంచి బీఆర్‌ఎస్‌ గూటికి వెళ్లిన ప్రవీణ్‌కుమార్‌కు తమ పార్టీలో మంచి భవిష్యత్‌ ఉంటుందని కేసీఆర్‌ చెప్పారు. ఆపద సమయంలో ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్‌లో చేరడాన్ని మర్చిపోనన్నారు కేసీఆర్.

New Update
RS Praveen Kumar : వారిలా నేను గొర్రెను కాను.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆసక్తికర ట్వీట్..!

RS Praveen Kumar : బీఎస్పీ(BSP) కి రాజీనామా చేసిన మాజీ ఐపీఎస్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌(Ex IPS RS Praveen Kumar) బీఆర్‌ఎస్‌(BRS) కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించేందుకు కేసీఆర్‌(KCR) ఫిక్స్‌ అయ్యారు. మూడు రోజుల్లో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ప్రవీణ్‌కుమార్‌ను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. భవిష్యత్ లో కూడా ప్రవీణ్ కుమార్ కి బీఆర్ఎస్ పార్టీలో మంచి భవిష్యత్తు ఉంటుందని కేసీఆర్‌ చెప్పారు. ఆపద సమయంలో ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్‌లో చేరడాన్ని మర్చిపోనని కేసీఆర్‌ చెప్పుకొచ్చారు. పదవుల కోసం పార్టీలు మారుతున్న నేతల గురించి పట్టించుకోవద్దని తెలిపారు.

పోతే పోయారు.. నష్టమేమీ లేదు:
ఒక ఎమ్మెల్యే,ఎంపీ పోయినంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన నష్టం ఏమి లేదన్నారు కేసీఆర్‌. ఇటీవలే దానం నాగేందర్‌తో పాటు రంజీత్‌రెడ్డి కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. వీరిని ఉద్దేశించే కేసీఆర్‌ ఈ కామెంట్స్‌ చేసినట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో మనోడు ఎవరు, మంది వాడు ఎవడనే విషయం తెలిసిందన్నారు కేసీఆర్‌. మళ్ళీ ఎన్నికలు రాగానే ఇప్పుడు పార్టీ వీడిన వారందరు టికెట్ల కోసం మళ్ళీ పార్టీ ఆఫీస్ ముందు లైన్లో నిలుచుంటారన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వీడిన వారిని భవిష్యత్ లో మళ్ళీ పార్టీలోకి తీసుకొమని కుండబద్దలు కొట్టారు గులాబీ బాస్‌. రాబోయే రోజుల్లో 100 సీట్లు గెలుస్తామని. ఇందులో అనుమానం వద్దని చెప్పారు.

ఇక రెండు రోజుల క్రితం(మార్చి 16) ప్రవీణ్‌కుమార్‌ బీఎస్‌పీని వీడుతున్నట్టు ప్రకటించి సంచలనం రేపారు. బీఆర్‌ఎస్‌-బీఎస్పీ పొత్తు ఒప్పందంలో భాగంగా ఎన్ని ఒడిదుడుకులొచ్చినా ముందుకు సాగాల్సిందే అని.. కష్టసుఖాలు పంచుకోవాల్సిందేనన్నారు ప్రవీణ్‌. ఇదే నేను నమ్మిన నిజమైన ధర్మమని.. బీఎస్పీ- బీఆర్‌ఎస్ పొత్తు వార్త బయటికి వచ్చిన వెంటనే బీజేపీ ఈ చారిత్రాత్మక పొత్తును భగ్నం చేయాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నదని.. బీజేపీ కుట్రలకు భయపడి నేను నమ్ముకున్న విలువలకు తిలోదకాలు ఇవ్వలేనని చెప్పారు ప్రవీణ్‌. తన ప్రస్థానాన్ని ఆపలేనని చెప్పిన ప్రవీణ్‌ బీఎస్పీని వీడి గులాబీ గూటికి వచ్చారు.

Also Read : ఎమ్మెల్యే అభ్యర్థులకు జగన్ వార్నింగ్!

Advertisment
తాజా కథనాలు