Baharampur: లోక్ సభ బరిలోకి మాజీ క్రికెటర్ పఠాన్.. అక్కడినుంచే పోటీ!

భారత మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ పొలిటికల్ ఎంట్రీకి సిద్ధమయ్యారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్(TMC) తరుపున బహరంపూర్ నుంచి ఎంపీగా పోటీ చేయనున్నారు. యూసఫ్ ఈ రోజు మ‌మ‌త బెన‌ర్జీ స‌మ‌క్షంలో తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

New Update
Baharampur: లోక్ సభ బరిలోకి మాజీ క్రికెటర్ పఠాన్.. అక్కడినుంచే పోటీ!

Yusuf Pathan: మరో భారత మాజీ క్రికెటర్ రాజకీయాల్లోకి రాబోతున్నారు. ఇప్పటికే గౌతమ్ గంభీర్ బీజేపీ తరఫున పొలిటికల్ ఎంట్రీ ఇవ్వగా.. ఇప్పుడు యూసుఫ్ పఠాన్ సైతం రాజకీయ అరంగ్రేటం చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు 2024 సార్వత్రిక ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్(TMC) తరుపున ఎంపీగా పోటీ చేయనుట్లు అధికారిక ప్రకటన వెలువడింది.

రంజన్ చౌదరిపై పోటీ.
ఈ మేరకు యూసుఫ్ పఠాన్ బహరంపూర్ పార్లమెంట్ స్థానం తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. రాబోయే లోక్‌సభ ఎన్నికల 2024 కోసం తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ ఆదివారం 42 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను జాబితాను విడుదల చేశారు. ఇందులో యూసుఫ్ పఠాన్ పేరుండగా.. యూసుఫ్ మ‌మ‌త బెన‌ర్జీ స‌మ‌క్షంలో తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కోల్‌క‌తాలోని బ్రిగేడ్ ప‌రేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన మెగా ర్యాలీలో ప‌ఠాన్.. టీఎంసీ కండువా క‌ప్పుకున్నారు. అతడు తృణమూల్ అభ్యర్థిగా అధిర్ రంజన్ చౌదరిపై పోటీ చేయబోతున్నట్లు సమాచారం. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి మొత్తం 42 స్థానాలకుగానూ అభ్యర్థులను టీఎమ్ సీ ప్రకటించింది.

#yusuf-pathan #tmc #political-entry #baharampur
Advertisment
Advertisment
తాజా కథనాలు