Euthanasia: చేతిలో చేయి వేసి.. కారుణ్య మరణం పొందిన డచ్‌ మాజీ ప్రధాని దంపతులు

నెదర్లాండ్‌ మాజీ ప్రధానమంత్రి డ్రైస్ వాన్‌ అగ్డ్ (93), ఆయన సతీమణి యూజిని (93) కారుణ్య మరణంతో (euthanasia) ప్రాణాలు విడిచారు. కొన్నేళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కారణంగా వీరు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

New Update
Euthanasia: చేతిలో చేయి వేసి.. కారుణ్య మరణం పొందిన డచ్‌ మాజీ ప్రధాని దంపతులు

Euthanasia: నెదర్లాండ్‌ మాజీ ప్రధానమంత్రి డ్రైస్ వాన్‌ అగ్డ్ (93), ఆయన సతీమణి యూజిని (93) కారుణ్య మరణంతో (euthanasia) లోకాన్ని విడిచారు. గత కొన్నేళ్లుగా వీళ్లను అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయని.. ఈ కారణంతోనే వీరిద్దరు చనిపోవాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈనెల 5వ తేదీన వారు ప్రాణాలు విడిచినట్లు డ్రైస్‌ స్థాపించిన మానవ హక్కుల సంస్థ 'ది రైట్స్‌ ఫోరమ్‌' తాజాగా వెల్లడించింది.

publive-image

ఒకరి చేయి ఒకరు పట్టుకొని 

ఇక వివరాల్లోకి వెళ్తే.. డ్రైస్‌ వాన్‌ 2019లో బ్రెయిన్‌ హేమరేజ్‌ అనే వ్యాధికి గురయ్యాడు. ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నప్పటికూ కూడా ఆ వ్యాధి నుంచి ఆయన పూర్తిగా కోలుకోలేకపోయారు. ఇక ఆయన భార్య యూజిని కూడా అనారోగ్యానికి గురయ్యారు. అందుకే ఇక చేసేదేం లేక కారుణ్య మరణానికి సిద్ధమయ్యారు. దాదాపు 70 ఏళ్ల పాటు దాంపత్య జీవితాన్ని సాగించిన వీరు.. ఒకరి చేతిని మరోకరు పట్టుకొని.. ఒకరి కళ్లల్లోకి ఒకరు చూసుకుంటూ ఒకేసారి తమ ప్రాణాలు విడిచారు. డ్రైస్ వాన్‌ అగ్డ్.. 1977 నుంచి 1982 వరకు ఆయన నెదర్లాండ్‌ ప్రధానమంత్రిగా పనిచేశారు. క్రిస్టియన్‌ డెమోక్రటిక్‌ అప్పీల్‌ పార్టీ నుంచి వచ్చిన మొదటి ప్రధాని ఆయనే కావడం విశేషం.

publive-image

యుథనాసియా (euthanasia) అంటే ఏంటి.
యుథనాసియా అంటే కారుణ్య మరణం. అనారోగ్యం సమస్యలు, భరించలేని బాధల నుంచి ఉపశమనం పొందలేని వారు ఈ 'యుథనాసియా' (కారుణ్య మరణాన్ని) కోరుకుంటారు. అయితే 2002లో నెదర్లాండ్‌లో కారణ్య మరణాన్ని చట్టబద్దం చేశారు. 2020లో ఆ దేశంలో ఏకంగా 8720 మంది కారుణ్య మరణం పొందారు. అదే ఏడాదిలో 13 జంటలు, 2021లో 16 జంటలు, 2022లో 29 జంటలు కారుణ్య మరణాన్ని ఎంచుకున్నారు. అయితే కారుణ్య మరణం పొందాలనుకునే సదరు వ్యక్తి.. అనారోగ్య సమస్యలు, బాధల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని.. వీటి నుంచి ఉపశమనం పొందలేకపోతున్నామని వైద్యుని నుంచి సంతకం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాతే ఆయా వ్యక్తులకు ప్రభుత్వం అనుమతి ఇస్తుంది.

publive-image

ఏ దేశాల్లో కారుణ్య మరణం చట్టబద్ధం

మరికొన్ని కేసుల్లో.. ఆ వ్యక్తి నిర్ణయం తీసుకోని పరిస్థితుల్లో ఉన్నట్లైతే.. వారి కుటుంబ సభ్యులు కూడా అనుమతితో కూడా కారుణ్య మరణానికి అనుమతి ఇస్తారు. విషపూరిత ఇంజెక్షన్‌ తీసుకొని వారు ప్రాణాలు విడుస్తారు. అయితే ఇది నెదర్లాండ్‌లో చట్టబద్ధం చేసిన తర్వాత వీటి మరణాల సంఖ్య పెరిగిపోయిందని ప్రభుత్వ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. నెదర్లాండ్‌తో పాటు.. బెల్జియం, ఆస్ట్రేలియా, అమెరికా, కెనడా, ఫిన్‌లాండ్, జర్మని, ఫ్రాన్స్‌, డెన్‌మార్క్‌ లాంటి దేశాల్లో కారుణ్య మరణానికి చట్టబద్ధత ఉంది. అయితే ఇందులో కూడా రెండు రకాలు ఉంటాయి. ఒకటి యాక్టీవ్‌ యుథనాసియా, మరొకటి పాస్సీవ్ యుథనాసియా. యాక్టీవ్ యుథనాసియా అంటే విషపూరిత ఇంజక్షన్‌ను సదరు వ్యక్తికి ఇస్తారు. ఇక పాసీవ్ యుథనాసియా అంటే వెంటిలేటర్‌ లేదా ట్యూబ్‌లు పెట్టి ఆ వ్యక్తి జీవితానికి ముగింపు పలుకుతారు. అయితే మన భారత్‌లో 2018లో పాసీవ్‌ యుథనాసియాను చట్టబద్ధం చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు