TS News: మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుకు 14రోజుల రిమాండ్.!

స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుకు నాంపల్లి కోర్టు 14రోజుల రిమాండ్ విధించింది. ప్రణీత్ రావును పంజాగుట్ట పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు. ఎస్ఐబీలో కీలక సమాచారాన్ని మాయం చేశారన్న ఆరోపణలపై ప్రణీత్ రావుపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

New Update
TS News: మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుకు 14రోజుల రిమాండ్.!

TS News:  స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుకు నాంపల్లి కోర్టు 14రోజుల రిమాండ్ విధించింది. ప్రణీత్ రావును పంజాగుట్ట పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు. ఎస్ఐబీలో కీలక సమాచారాన్ని మాయం చేశారన్న ఆరోపణలపై ప్రణీత్ రావుపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అంతర్గత విచారణలో ఆధారాలు లభ్యం అయ్యాయి. ఈనెల 4వ తేదీనే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వుల జారీ చేశారు.

ఆ సమయంలో ప్రణీత్ రావు సిరిసిల్ల డీసీఆర్బీ డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. సస్పెన్షన్ అమల్లో ఉన్న కాలంలో సిరిసిల్ల హెడ్ క్వార్టర్ ను విడిచి వెళ్లరాదని ఉత్తర్వుల్లో పేర్కొనడంతో కుటుంబ సభ్యులతోపాటు అక్కడే ఉంటున్నారు. మంగళవారం రాత్రి సిరిసిల్లలో ప్రణీత్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం హైదరాబాద్ కు తరలించారు. బుధవారం తెల్లవారుజామున అరెస్టు చేసి..జ్యూడీషియల్ కస్టడీ కోరుతూ కోర్టులో హాజరుపరిచారు. కేసు దర్యాప్తు కోసం జూబ్లీహిల్స్ ఏసీబీ వెంకటగిరి బ్రుందాన్ని ఏర్పాటు చేశారు.

ఏం జరిగిందంటే?
గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్(Phone Tapping) చేశారనే ఆరోపణలు ప్రణీత్ రావు పై ఉన్నాయి. దీనిపై కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం విచారణకు ఆదేశాలు ఇచ్చింది. ఈ క్రమంలో ఆయన్ను విధుల్లో నుంచి తప్పించింది రేవంత్ సర్కార్. అయితే.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సస్పెన్షన్‌కు గురైన ఎస్ఐబీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్ రావు అంశంలో కీలక విషయాలు వెలుగు చూశాయి. ఎస్ఐబీలోని ఎస్ఓటి టీంలో కీలకంగా ఆయన వ్యవహరించారు. ఎస్ఐబీ(SIB) ఆఫీస్ లో సీసీ కెమెరాలు ఆఫ్ చేసి రికార్డులను ప్రణీత్ రావు మాయం చేసినట్లు అధికారులు గుర్తించారు. 42 హార్డ్ డిస్క్‌లను ప్రణీత్ రావు ఎత్తుకెళ్లినట్లు తేల్చారు. 1600 పేజీల కాల్ డేటాను ప్రణీత్ రావు తగులబెట్టినట్లు నిర్ధారించారు. కీలకమైన ఎస్ఓటి లాకర్ రూంలోని ఫైల్స్ మొత్తం ప్రణీత్ రావు ధ్వంసం చేసినట్లు పోలీసు శాఖ గుర్తించింది. కీలక నేత ఫోన్ ట్యాపింగ్ డేటాతో పాటు.. కాల్ రికార్డులు కొన్ని ఐఎంఈ నెంబర్లతో పాటు ఐపీడీఆర్ డేటాని కూడా నాశనం చేసినట్లు గుర్తించారు. స్పెషల్ ఆపరేషన్ టీమ్స్ తయారు చేసిన డేటా మొత్తాన్ని ప్రణీత్ రావు ధ్వంసం చేసినట్లు పేర్కొంది. హెచ్ డీడీకి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని కూడా ధ్వంసం చేసినట్లు పోలీస్ శాఖ తెలిపింది.

ఇక, నేరపూరితమైన కుట్రలో భాగంగానే ఫైల్స్ ను ప్రణీత్ రావు ధ్వంసం చేసినట్లు పోలీస్ శాఖ తెలిపింది. ల్యాప్ టాప్, హార్డ్ డిస్క్‌లు ధ్వంసం చేసినట్లు తేల్చారు. డేటాబేస్‌లోని మొత్తం డేటాను ప్రణీత్ రిమూవ్ చేసినట్లు గుర్తించారు. ఎలక్ట్రీషియన్ సాయంతో సీసీ కెమెరాలు ఆఫ్ చేసి.. రికార్డులను ప్రణీత్ రావు ధ్వంసం చేసినట్లు తేలింది. అయితే ప్రణీత్ రావు గత ప్రభుత్వ హయాంలో ఎస్ఐబీ డీఎస్పీగా పనిచేస్తూ దాదాపు 30 మంది పోలీసు సిబ్బందితో ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు ఆరోపణలు ఉండగా రూల్స్ అతిక్రమించినట్లు తేలగా ఆయనపై గతంలో సస్పెన్షన్ వేటు పడింది.

ఇది కూడా చదవండి: నలుగురి ప్రాణాలు తీసిన రిపోర్టర్లు..అసలు కారణం ఇదే.!

Advertisment
తాజా కథనాలు