DRUGS: పాఠశాలల్లో ప్రహరీ క్లబ్‌లు.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం!

రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాలను అరికట్టేందుకు రేవంత్ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. అన్ని పాఠశాలల్లో ప్రహరీ క్లబ్ ల ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. త్వరలోనే గైడ్ లైన్స్ విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు.

DRUGS: పాఠశాలల్లో ప్రహరీ క్లబ్‌లు.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం!
New Update

Telangana: తెలంగాణలో డ్రగ్స్, గంజాయి, తదితర మత్తు పదార్థాలను పూర్తిగా అరికట్టేందుకు రేవంత్ సర్కార్ పక్కా ప్రణాళికతో ముందుకెళ్తుంది. ఇప్పటికే హైదరాబాద్ నగరంతోపాటు అన్ని గ్రామాలు, పట్టణాల్లోనూ అధికారులను అలర్ట్ చేసింది. ఇందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ హైస్కూళ్లల్లో ప్రహరీ క్లబ్ ల ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. బడి పిల్లలను మాదకద్రవ్యాల నుంచి దూరం చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఈ మేరకు ప్రహారీ క్లబ్ లో హెడ్ మాస్టర్ లేదా ప్రిన్సిపాల్ అధ్యక్షుడిగా ఉంటాడు. సీనియర్ టీచర్ లేదా ఫ్రెండ్లీ టీచర్ వైస్ ప్రెసిడెంట్ గా నియమిస్తారు. 6 నుంచి పదో తరగతి వరకు ప్రతి క్లాసులో ఇద్దరు విద్యార్థులు, స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి ఒక పోలీస్, పేరెంట్స్ నుంచి ఒకరు ప్రహరీ క్లబ్ లో సభ్యులుగా ఎన్నుకుంటారు. పిల్లలు మత్తు పదార్థాలకు అడిక్ట్ కాకుండా నిరంతరం అంగాహన కల్పిస్తూ, చర్యలు తీసుకుంటారు. కాగా ఇందుకు సంబంధించిన పూర్తి గైడ్ లైన్స్ ప్రభుత్వం త్వరలోనే విడుదల చేయనున్నట్లు బుర్రా వెంకటేశం తెలిపారు.

#cm-revant #prahari-clubs #telangana-schools
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe