Hyderabad : సీఎం రమేష్‌ పై ఫోర్జరీ కేసు నమోదు..

బీజేపీ రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్‌పై జూబ్లీహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో ఫోర్జరీ కేసు నమోదైంది. సినీ హిరో వేణు.. తన PCL జాయింట్ వెంచర్ కంపెనీలో.. సీఎం రమేష్ ఫోర్జరీకి పాల్పడి రూ.450 కోట్లు స్కామ్ చేశారని ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

CM Ramesh: వైసీపీలో వీళ్లు తప్ప ఎవరూ మిగలరు.. సీఎం రమేష్ హాట్ కామెంట్స్
New Update

CM Ramesh : బీజేపీ(BJP) రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్‌(CM Ramesh) పై హైదరాబాద్‌(Hyderabad) లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌(Jubilee Hills Police Station) లో ఫోర్జరీ కేసు నమోదైంది. సినీ హిరో వేణు..  తన PCL జాయింట్ వెంచర్ కంపెనీలో.. సీఎం రమేష్ ఫోర్జరీకి పాల్పడి రూ.450 కోట్లు స్కామ్ చేశారనే ఆరోపణలతో ఆయనపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దీన్ని సెంట్రల్ క్రైమ్ స్టేషన్‌కు ట్రాన్స్‌ఫర్ చేశారు. అయితే దీనిపై సినీ హిరో వేణు తరఫున కావూరి భాస్కర్‌రావు స్టేట్‌మెంట్ ఇచ్చారు.

Also Read : అందుకే మా పొత్తు.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

వేల కోట్ల స్కామ్ చేశారు

ఈరోజు క్రైమ్ ఏపీసీ అరగంట సేపు నా స్టేట్‌మెట్ రికార్డు చేశారని కావూరి తెలిపారు. సీఎం రమేష్‌ వేల కోట్లు స్కామ్(Thousand Crores Scam) చేశాడనే ఆరోపణలు ఉన్నాయని.. సీబీఐతో విచారణ చేయిస్తే అన్ని విషయాలు బయటికొస్తాయని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. గతంలో టీడీపీ పార్టీ నుంచి ఎంపీగా గెలిచిన సీఎం రమేష్ ఆ తర్వాత బీజేపీలో చేరారు. అయితే ఈసారి పొత్తులో భాగంగా బీజేపీ.. ఆంధ్రప్రదేశ్‌లో ఆరు ఎంపీ స్థానాల నుంచి పోటీ చేయనుంది. దీంతో సీఎం రమేష్ ఈసారి అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్నారు. కానీ బీజేపీ ఎంపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేయలేదు.

బీజేపీలో ఉండి కాంగ్రెస్‌కు విరాళాలు 

ఇదిలా ఉండగా.. ఇటీవల బయటికొచ్చిన ఎలక్టోరల్ బాండ్లలో సీఎం రమేష్ కాంగ్రెస్ పార్టీకి 30 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చినంగా ఇచ్చినట్లు గణంకాలు చెబుతున్నారు. అలాగే జనతాదల్‌ సెక్యులర్‌కు రూ.10 కోట్లు, తెలుగుదేశం పార్టీకి రూ.5 కోట్లు విరాళంగా ఇచ్చినట్లు లెక్కలు చెబుతున్నాయి. అయితే బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ఉంటూ.. కాంగ్రెస్‌కు విరాళాలు ఇవ్వడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. అయితే ఈ అంశంపై సీఎం రమేష్ ఇంతవరకు స్పందించలేదు. ఇక మే 13 ఏపీలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.

Also Read: జగన్ కు బిగ్ షాక్.. పులివెందుల నుంచి పోటీలో వైఎస్ సునీత?

#telugu-news #ap-politics #cm-ramesh #thousand-crores-scam
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe