Alluri Deistrict: తమ వ్యాపారాలు, డబ్బు సంపాదన కోసం ఏ జంతువునూ వదలడం లేదు స్మగ్లర్లు.ఆంధ్రప్రదేశ్‌లో తాబేళ్ళను విపరీతంగా అక్రమ రవాణా చేస్తున్నారు. కాకినాడ నుండి ఏజెన్సీ మీదుగా ఒడిశాకు అక్రమంగా కారులో తరలిస్తున్న 246 తాబేళ్లను అల్లూరు జిల్లా తులసిపాక అటవీ చెక్ పోస్ట్ వద్ద అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న 246 తాబేళ్లలో 16 తాబేళ్ళు మృతి చెందాయి. మిగతా వాటిని శబరి నదిలో వదిలిపెడతామని చెప్పారు. తాబేళ్లు ప్రపంచంలోని పురాతన సరీసృపాల సమూహాలలో ఒకటి. ఈ జీవులు 200 మిలియన్ సంవత్సరాల క్రితం డైనోసార్ల కాలం నాటివి.
తాబేలు ఏం తింటుందనేది అది నివసించే వాతావరణంపై ఆధారపడి ఉంటుంది. భూమిలో నివసించే తాబేళ్లు పండ్లు, గడ్డిని తింటాయి, అయితే సముద్రవాసులు ఆల్గే నుండి స్క్విడ్, జెల్లీ ఫిష్ వరకు ప్రతిదాన్ని తింటారు. కొన్ని తాబేళ్లు మాంసాహారులు , మరికొన్ని శాకాహారులు ఉంటాయి. మరికొన్ని సర్వభక్షకులు రెండింటిని ఆహారంగా తీసుకుంటాయి. ఇక తాబేళ్లలో ‘అమ్నియోట్స్’ లాంటి అవి గాలిని పీల్చుకుంటాయి. భూమిపై గుడ్లు పెడతాయి అయినప్పటికీ అనేక జాతులు నీటిలో లేదా చుట్టుపక్కల నివసిస్తాయి. ఇవి జీవ వైవిధ్యంలో కాపాడటంలో ముందు ఉంటాయి. అలాంటి తాబేళ్లను అక్రమరవాణా చేస్తున్న ముఠాలను పట్టుకుని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.