Republic Day : భారతదేశ చరిత్రలో తొలిసారిగా ఢిల్లీ పోలీసుల మహిళా దళం గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో పాల్గొనబోతోంది. ఇన్‌స్పెక్టర్ బిషన్ దాస్ ఠాకూర్ పర్యవేక్షణలో 2019, 2021 సంవత్సరానికి చెందిన మహిళా కానిస్టేబుళ్లు ఎంతో ఉత్సాహంగా గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు సిద్ధమవుతున్నారు. ఈ స్క్వాడ్ కమాండర్ శ్వేతా సుగతన్, 2019 బ్యాచ్ AGMUT కేడర్‌కు చెందిన మహిళా IPS. ఢిల్లీ పోలీసు చరిత్రలో, ఉత్తర జిల్లా అదనపు డిప్యూటీ కమిషనర్, శ్వేతా సుగతన్ గణతంత్ర దినోత్సవం రోజున ఢిల్లీ పోలీసు బృందానికి నాయకత్వం వహించే అవకాశాన్ని పొందిన రెండవ ఢిల్లీ పోలీసు అధికారిణి.
ఢిల్లీ పోలీసుల మహిళా దళం చరిత్ర సృష్టించేందుకు రెడీ:
దట్టమైన పొగమంచు, ఎముకలు కొరికే చలిలో కూడా ఢిల్లీ పోలీసుల ఈ మహిళా స్క్వాడ్ ఉత్సాహాన్ని తగ్గించలేకపోతున్నాయి. ఇన్‌స్పెక్టర్ బిషన్ దాస్ ఠాకూర్ తెలిపిన వివరాల ప్రకారం, గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో మొదటి స్థానంలో నిలిచి చరిత్ర సృష్టించేందుకు ఢిల్లీ పోలీసుల మహిళా దళం శాయశక్తులా ప్రయత్నిస్తోంది. అదే సమయంలో, గత 36 సంవత్సరాలుగా ఢిల్లీ పోలీసుల పరేడ్ శిక్షణకు ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తున్న బిషన్ దాస్ ఠాకూర్‌కు కూడా ఇది చాలా గర్వకారణం. ఈ సంవత్సరం అతను ఢిల్లీ పోలీసుల నుండి పదవీ విరమణ చేయనున్నందున అతని వద్ద శిక్షణ పొందిన చివరి పరేడ్ స్క్వాడ్ ఇదే.
పైప్ బ్యాండ్ , బ్రాస్ బ్యాండ్ కూడా కవాతులో పాల్గొంటున్నాయి:
ఈ సంవత్సరం కూడా, కొత్తగా రూపొందించిన మహిళల పైప్ బ్యాండ్, ఢిల్లీ పోలీసుల బ్రాస్ బ్యాండ్ కూడా రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొంటోంది. దీనికి నార్త్ ఈస్ట్ రెసిడెంట్ కానిస్టేబుల్ రుయాంగునువో కెనెస్ నాయకత్వం వహిస్తున్నారు. పోలీస్ కమీషనర్ సంజయ్ అరోరా, స్పెషల్ కమీషనర్ ఆఫ్ పోలీస్ రాబిన్ హిబు ఆధ్వర్యంలో సాయుధ పోలీసు దళం, ఢిల్లీ పోలీసు మహిళా దళం, ఢిల్లీ పోలీసు మహిళా బ్యాండ్ స్క్వాడ్ గణతంత్ర దినోత్సవం కోసం సర్వశక్తులు ఒడ్డి సిద్ధమవుతున్నాయి.
ఇది కూడా చదవండి: ఆ దుర్మార్గులు చచ్చేదాకా జైల్లోనే.. సూర్యాపేట కోర్టు సంచలన తీర్పు..!!