Passport: ఐదురోజులుగా...నిలిచిన పాస్‌ పోర్టు సేవలు!

హైదరాబాద్ లోని పాస్ పోర్టు కేంద్రాల్లో గత ఐదురోజులుగా బంద్‌ అయ్యాయి. బేగంపేట్‌, అమీర్‌పేట్‌, టోలిచౌకిల్లోని పాస్‌పోర్టు సేవా కేంద్రాల్లో స్లాట్‌ బుకింగ్‌ను ఆపివేశారు.పూర్తి వివరాలు ఈ కథనంలో...

Bombay High Court : లేని పాస్‌ పోర్టును పొందేందుకు నిందితునికి 4 నెలల గడువు!
New Update

Passport: హైదరాబాద్ లోని పాస్ పోర్టు కేంద్రాల్లో గత ఐదురోజులుగా బంద్‌ అయ్యాయి. బేగంపేట్‌, అమీర్‌పేట్‌, టోలిచౌకిల్లోని పాస్‌పోర్టు సేవా కేంద్రాల్లో స్లాట్‌ బుకింగ్‌ను ఆపివేశారు. నిజానికి ఆన్‌లైన్‌లో ఈ కేంద్రాలకు సంబంధించిన స్లాట్లు ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ.. బుకింగ్‌ జరగడం లేదు. దీంతో నగరవాసులు పాస్‌పోర్టు దరఖాస్తుకు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

నిజానికి వేసవి సెలవుల్లో పాస్‌పోర్టుకు దరఖాస్తులు పెరుగుతుంటాయి. తీవ్ర డిమాండ్‌ ఉన్నా.. ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయ అధికారులు ఆ సేవా కేంద్రాల్లో సర్వీసులను నిలిపివేయడంతో.. నగరవాసులు ఇతర జిల్లాలకు పరుగులు పెడుతున్నారు. నగర వాసుల తాకిడి పెరగడంతో పొరుగునే ఉన్న మేడ్చల్‌, వికారాబాద్‌, నల్లగొండ పాస్‌పోర్టు కేంద్రాల్లో రద్దీ కనిపిస్తోంది.

పాస్‌పోర్టు దరఖాస్తుకు దూరాభారాన్ని భరిస్తున్నామని నగర పౌరులు వాపోతున్నారు. ఈ సమస్యపై ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయానికి ఫిర్యాదులు వెళ్తున్నా.. వాటిపై స్పందించేవారే లేరని పలువురు దరఖాస్తుదారులు ఆరోపించారు.

Also read: అలాంటి పాత్రలు చేయాలని ఉందంటున్న ముద్దుగుమ్మ!

#hyderabad #passport #bandh
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe