Foot Pain Remedies: ప్రస్తుతం ఉన్న జీవనశైలిలో రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అందరికీ ఏదో ఒక సమస్య వేధిస్తూనే ఉంటుంది. చాలామంది కాలి మడమ నొప్పితో బాధపడుతూ ఉంటారు. దీని నుంచి ఉపశమనం పొందడానికి నొప్పి ఉన్న దగ్గర లవంగా నూనెతో మసాజ్ చేస్తే రక్త ప్రసరణ పెరిగి కండరాలకు ఉపశమనం వస్తుంది. ఈ సమస్య ఉన్నప్పుడు నడవడం కూడా చాలా ఇబ్బందిగానే ఉంటుంది. సీజన్‌తో సంబంధం లేకుండా ఈ నొప్పి అందరినీ వేధిస్తూనే ఉంటుంది. ఇక చలికాలంలో అయితే ఈ సమస్య మరి ఎక్కువ అవుతుంది. అయితే ఈ పాదాల నొప్పులకు అనేక కారణాలున్నాయని వైద్యులు అంటున్నారు. వాటిల్లో ప్రధాన కారణాలు ఎక్కువసేపు నిలబడటం, బరువు పెరగడం, చెప్పులు ధరించడం, ఎత్తు మడమల బూట్లు, శరీరంలో కాల్షియం లేకపోవడం వలన సమస్యలు వస్తుంది. ఇలా నొప్పితో ఇబ్బంది పడేవారు రకరకాల మందులు వేసుకుంటారు. అయితే.. కొన్ని ఇంటి చిట్కాలతో పాదాల నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు కొన్ని విషయాలను తెలుసుకుందాం.
పాదాల నొప్పి నివారణకు చక్కటి చిట్కాలు
పసుపు: పసుపు మడమ నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి బాగా ఉపయోగపడుతుంది. పసుపులలో వ్యాధి నిరోధక లక్షణాలు ఎక్కువగా అందుకని వాపును వెంటనే తగ్గిస్తుంది. పసుపు నీళ్లలో కొద్దిగా తేనె కలుపుకుని తాగితే మంచి ఉపశమనం ఉంటుంది. దీంతోపాటు పసుపు పాలు తాగినా.. నొప్పి , వాపు వెంటనే తగ్గుతుంది.
రాతి ఉప్పు: మడమ నొప్పి నుంచి ఉపశమనం కావాలంటే రాతి ఉప్పు బెస్ట్. ముందుగా ఒక గిన్నేలో నీటిని వేడి చేసి, దానిలో కొద్దిగా రాక్ సాల్ట్ వేసి ఈ నీటిలో 15 -20 నిమిషాలపాటు పాదాలను ఉంచాలి. ఇలా చేస్తే మడమ నొప్పి, వాపు తగ్గుతుంది.
చేపలు: నొప్పి, మడమల వాపు నుంచి ఉపశమనం పొందాలంటే రోజూ ఆహారంలో చేపలు తినాలి. చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లున్నాయి. ఇవి నొప్పి , వాపును తగ్గించి ఎముకలను బలోపేతం చేస్తుంది.
అల్లం: అల్లం కూడా మడమ నొప్పి నుంచి ఉపశమనం కలిగుతుంది. ముందుగా కొద్దీగా నీళ్లలో అల్లం వేసి మరగనివ్వాలి. ఈ నీరు సగానికి వచ్చిన తర్వాత అందులో నిమ్మరసం, తేనె వేసి తాగాలి. ఇలా చేస్తే చీలమండల నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.
లవంగం నూనెతో మసాజ్: లవంగం నూనెతో మసాజ్ చేస్తే మడమ నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇలా చేస్తే రక్త ప్రసరణ పెరిగి కండరాలకు ఉపశమనం దొరుకుతుంది.
ఆపిల్ సైడర్ వెనిగర్: మడమల నొప్పి, వాపు ఉంటే.. ఆపిల్ సైడర్ వెనిగర్ మంచి ఫలితం ఉంటుంది. కొన్ని నీరు వేడి చేసి దానిలో కొన్ని చుక్కల ఆపిల్ సైడర్ వెనిగర్ వేసి కలిపి పాదాలను మసాజ్ చేయడం వల్ల ఉపశమనం లభిస్తుంది.
ఐస్ క్యూబ్స్: మడమల నొప్పి ఉన్న ప్రాంతంలో రోజూ ఐస్ క్యూబ్‌లు ఉంచాలి. ఐస్ గడ్డను నేరుగా కాకుండా గుడ్డలో ఉంచి నొప్పి ఉన్న దగ్గర సున్నితంగా మసాజ్ చేస్తే ఉపశమనం లభిస్తుంది.