Health Tips: రాత్రిపూట ఇవి తింటున్నారా?.. జాగ్రత్త!

ప్రస్తుత రోజుల్లో చాలా మందికి ఆహారం సమయానికి తినడం కష్టంగా మారింది. ఈ బిజీ లైఫ్‌లో కొందరు ఫుడ్ కూడా స్కిప్ చేస్తున్నారు. అయితే, రాత్రి సమయంలో కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నట్లు వైద్యులు తెలుపుతున్నారు.

Health Tips: రాత్రిపూట ఇవి తింటున్నారా?.. జాగ్రత్త!
New Update

అరటి పండు:

publive-image
దీనికి ఆమ్లాలను హరించే లక్షణం ఉంది. కాబట్టి, గుండెల్లో మంట తగ్గిస్తుంది. పగలు తింటే ఆ శక్తి ఇనుమడిస్తుంది. అదే రాత్రిపూట తీసుకుంటే.. దగ్గు, జలుబు తదితర సమస్యలు ఎదురుకావచ్చు. కాబట్టి, రాత్రిళ్లు అరటిపండు తినకపోవడమే మేలు.

పెరుగు:

publive-image
అరుగుదలకు దోహదం చేస్తుంది. పేగుల ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. కానీ రాత్రి పూట తింటే మాత్రం ఎసిడిటీని పెంచుతుంది. శ్వాసమార్గంపై చెడు ప్రభావం చూపుతుంది.

గ్రీన్‌ టీ:

publive-image
పగటిపూట ఎప్పుడు తీసుకున్నా మంచిదే. పరగడుపున తాగితే మాత్రం.. అందులోని కెఫీన్‌ వల్ల డీహైడ్రేషన్‌, ఎసిడిటీ వంటి సమస్యలు వస్తాయి.

అన్నం:

publive-image
రాత్రి పూట సాధ్యమైనంత వరకూ అన్నానికి దూరంగా ఉండటం మేలు. అన్నంలో పిండిపదార్థం ఎక్కువ. దీంతో కడుపు ఉబ్బినట్టుగా ఉంటుంది. సరిగా నిద్రపట్టదు. అరుగుదల కూడా ఓ సమస్యే. దీనివల్ల బరువు పెరిగే ప్రమాదం ఉంది.

పాలు:

publive-image
పోషకాలు పుష్కలం. పగటిపూట ఎక్కువసార్లు తాగితే.. కాస్త అసౌకర్యంగా ఉంటుంది. కారణం, జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పట్టడమే. అదే రాత్రిళ్లు శరీరానికి విశ్రాంతిగా ఉంటుంది. పోషకాలను శరీరం శోషించుకుంటుంది.

యాపిల్‌:

publive-image
ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్లు అధికం. రాత్రిపూట యాపిల్‌ తింటే ఎసిడిటీ పెరుగుతుంది. అదే, పగటి పూట అయితే.. అరుగుదలకు సహకరిస్తుంది.

డార్క్‌ చాక్లెట్‌:

publive-image
రాత్రితో పోలిస్తే పగలే ఎక్కువ ప్రభావం చూపుతుంది డార్క్‌ చాక్లెట్‌. రక్తపోటును తగ్గిస్తుంది. గుండె జబ్బులను కూడా నియంత్రించే స్వభావం ఉంది.

కాఫీ:

publive-image
చాలామంది రాత్రిళ్లు మేలుకోవడానికి కాఫీ తాగుతారు. ఇది చాలా అనారోగ్యకరమైన అలవాటు. రాత్రి పూట తాగే కాఫీ జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. కెఫీన్‌ వల్ల నిద్రకు దూరమవుతాం. పగలైతే ఆ సమస్య ఉండదు.

#health-tips #food-safety
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి