Health Tips: రాత్రిపూట ఇవి తింటున్నారా?.. జాగ్రత్త! ప్రస్తుత రోజుల్లో చాలా మందికి ఆహారం సమయానికి తినడం కష్టంగా మారింది. ఈ బిజీ లైఫ్‌లో కొందరు ఫుడ్ కూడా స్కిప్ చేస్తున్నారు. అయితే, రాత్రి సమయంలో కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నట్లు వైద్యులు తెలుపుతున్నారు. By V.J Reddy 08 Nov 2023 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి అరటి పండు: దీనికి ఆమ్లాలను హరించే లక్షణం ఉంది. కాబట్టి, గుండెల్లో మంట తగ్గిస్తుంది. పగలు తింటే ఆ శక్తి ఇనుమడిస్తుంది. అదే రాత్రిపూట తీసుకుంటే.. దగ్గు, జలుబు తదితర సమస్యలు ఎదురుకావచ్చు. కాబట్టి, రాత్రిళ్లు అరటిపండు తినకపోవడమే మేలు. పెరుగు: అరుగుదలకు దోహదం చేస్తుంది. పేగుల ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. కానీ రాత్రి పూట తింటే మాత్రం ఎసిడిటీని పెంచుతుంది. శ్వాసమార్గంపై చెడు ప్రభావం చూపుతుంది. గ్రీన్ టీ: పగటిపూట ఎప్పుడు తీసుకున్నా మంచిదే. పరగడుపున తాగితే మాత్రం.. అందులోని కెఫీన్ వల్ల డీహైడ్రేషన్, ఎసిడిటీ వంటి సమస్యలు వస్తాయి. అన్నం: రాత్రి పూట సాధ్యమైనంత వరకూ అన్నానికి దూరంగా ఉండటం మేలు. అన్నంలో పిండిపదార్థం ఎక్కువ. దీంతో కడుపు ఉబ్బినట్టుగా ఉంటుంది. సరిగా నిద్రపట్టదు. అరుగుదల కూడా ఓ సమస్యే. దీనివల్ల బరువు పెరిగే ప్రమాదం ఉంది. పాలు: పోషకాలు పుష్కలం. పగటిపూట ఎక్కువసార్లు తాగితే.. కాస్త అసౌకర్యంగా ఉంటుంది. కారణం, జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పట్టడమే. అదే రాత్రిళ్లు శరీరానికి విశ్రాంతిగా ఉంటుంది. పోషకాలను శరీరం శోషించుకుంటుంది. యాపిల్: ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్లు అధికం. రాత్రిపూట యాపిల్ తింటే ఎసిడిటీ పెరుగుతుంది. అదే, పగటి పూట అయితే.. అరుగుదలకు సహకరిస్తుంది. డార్క్ చాక్లెట్: రాత్రితో పోలిస్తే పగలే ఎక్కువ ప్రభావం చూపుతుంది డార్క్ చాక్లెట్. రక్తపోటును తగ్గిస్తుంది. గుండె జబ్బులను కూడా నియంత్రించే స్వభావం ఉంది. కాఫీ: చాలామంది రాత్రిళ్లు మేలుకోవడానికి కాఫీ తాగుతారు. ఇది చాలా అనారోగ్యకరమైన అలవాటు. రాత్రి పూట తాగే కాఫీ జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. కెఫీన్ వల్ల నిద్రకు దూరమవుతాం. పగలైతే ఆ సమస్య ఉండదు. #food-safety #health-tips మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి