Hyderabad : కరాచీ బేకరీలో ఈ పదార్థాలు తీసుకుంటున్నారా? జాగ్రత్త..!

హైదరాబాద్‌ ఫేమస్ కరాచీ బేకరీలో ఫుడ్‌సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అంతర్జాతీయ గుర్తింపు పొందిన కరాచీ బేకరీలో కొన్ని ఎక్స్‌పైరీ డేట్ అయిపోయిన బిస్కెట్లు, మిఠాయిలు, చాక్లెట్ కేకుల పదార్థాలను గుర్తించారు. FSSAI నిబంధనల ఉల్లంఘన నేపథ్యంలో యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు.

New Update
Hyderabad : కరాచీ బేకరీలో ఈ పదార్థాలు తీసుకుంటున్నారా? జాగ్రత్త..!

Hyderabad Karachi Bakery : హైదరాబాద్‌లోని పలు హోటల్స్, బేకరీ షాపు(Bakery Shops) ల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు(FSSAI) తనిఖీలు నిర్వహిస్తున్నారు. తాజాగా, హైదరాబాద్‌లో ఫేమస్ అయిన కరాచీ బేకరీలో ఫుడ్‌సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. అంతర్జాతీయ గుర్తింపు పొందిన కరాచీ బేకరీ(Karachi Bakery) లో కొన్ని ఎక్స్‌పైరీ డేట్ అయిపోయిన పదార్థాలను ఉన్నట్లు గుర్తించారు అధికారులు.

Also Read: కేంద్ర పాలిత ప్రాంతంగా హైదరాబాద్.. కుండ బద్దలు కొట్టిన కేంద్ర మంత్రి!

రూ. 5, 200 విలువైన రస్క్‌లు, బిస్కెట్లు, మిఠాయిలు, చాక్లెట్ కేకులు, బన్స్‌ల గడువు ముగిసినట్లు గర్తించారు. మరోవైపు అనేక లేబుల్ లేని ఉత్పత్తులను కూడా కనుగొన్నారు. FSSAI నిబంధనల ఉల్లంఘన నేపథ్యంలో యాజమాన్యానికి ఫుడ్ సేఫ్టీ అధికారులు నోటీసులు జారీ చేశారు.

Advertisment
తాజా కథనాలు