Hidden Cameras: సీక్రెట్‌ కెమెరాల కలకలం.. ఈ చిట్కాలతో చెక్‌ పెట్టండి

ఈ మధ్యకాలంలో హోటల్స్‌, ఓయో రూమ్స్‌, వాష్‌రూమ్స్‌, గర్ల్స్‌ హాస్టల్స్‌ ఇలా ఎక్కడపడితే అక్కడ సీక్రెట్ కెమెరాలు బయటపడటం కలకలం రేపుతున్నాయి. మనకు తెలియకుండా పెట్టిన సీక్రెట్‌ కెమెరాలను కొన్ని చిట్కాలతో పట్టుకోవచ్చు. ఇందుకోసం ఈ పూర్తి ఆర్టికల్‌ను చదవండి.

New Update
Hidden Cameras: సీక్రెట్‌ కెమెరాల కలకలం.. ఈ చిట్కాలతో చెక్‌ పెట్టండి

ప్రస్తుతం సీక్రెట్ కెమెరాల వ్యవహారాలు కలకలం రేపుతున్నాయి. ఓయో రూముల్లో, హోటల్స్‌లో, గర్ల్స్‌ హాస్టల్స్‌లో ఇలా ఎక్కడపడితే అక్కడ కొందరు కేటుగాళ్లు రహస్య కెమెరాలు పెడుతున్నారు. ఇటీవల హైదరాబాద్‌ శివారు శంషాబాద్‌లో సిటా గ్రాండ్ ఓయో హోటల్‌లో సీక్రెట్ కెమెరాలు బయటపడ్డాయి. ఆ హోటల్ నిర్వాహకుడే బెడ్ రూంలలో ఉండే బల్బ్ లలో రహస్య కెమెరాలు పెట్టి అక్కడికి వచ్చే జంటల సన్నిహిత దృశ్యాలను రికార్డు చేశాడు. రికార్డులో ఉన్న వారి వివరాలు ఆధారంగా ఫోన్లు చేసి బ్లాక్ మెయిట్ చేశాడు. చివరికి బాధితులు సమాచారంతో అతడిని పోలీసులు అరెస్టు చేశారు. అంతకుముందు ఉత్తర​ప్రదేశ్‌లోని​ నోయిడాలోని పలు ఓయో హోటళ్లలో ఎవరికీ తెలియకుండా సిక్రేట్‌గా కెమెరాలు అమర్చి బ్లాక్ మెయిలింగ్ చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు.

తాజాగా కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ గర్ల్స్‌ హాస్టల్లో వాష్‌రూమ్‌లో సీక్రెట్ కెమెరా బయటపడటం దుమారం రేపుతోంది. దీంతో అక్కడి విద్యార్థులు ధర్నాకు దిగారు. అయితే ఓ రాజకీయ నేత కుమార్తెనే ఈ సీక్రెట్ కెమెరా పెట్టినట్లు తెలుస్తోంది. తన కూతురు పేరు బయటకు వస్తే.. కాలేజీ మూయిస్తానని ప్రిన్సిపల్‌కు అమ్మాయి తండ్రి వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. ఇలా వాష్‌రూంలలో, బెడ్‌రూంలలో ఎవరికీ తెలియకుండా సీక్రెట్ కెమెరాలు పెట్టడం దారుణమైన చర్య. ఇలాంటి వాటినుంచి బయటపడేందుకు మహిళలు పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అసలు ఈ సిక్రేట్ కెమెరాలు ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Also Read:  ఓహో.. కేటీఆర్ అమెరికా అందుకే వెళ్లారా? ఆయనను కలవబోతున్నారా?

ఎప్పుడైనా ఏదైనా హోటల్‌కు వెళ్లినప్పుడు ఆ రూమ్‌లో ఉన్న వస్తువులను జాగ్రత్తగా గమనించాలి. స్మోక్‌ డిటెక్టర్లు, గోడ గడియారాలు, ఎయిర్ ప్యూరిఫైయర్‌లు, లైట్ బల్బులు, పుస్తకాలు, గది తలుపులు, లావా ల్యాంప్స్‌, పెన్నుల్లో ఈ సీక్రెట్‌ కెమెరాలు అమర్చే అవకాశం ఉంటుంది. అలాగే మొబైల్‌ ఫోన్‌ ఫ్లాష్‌లైట్‌తో కూడా సీక్రెట్ కెమెరాలు గుర్తించవచ్చు. ఇందుకోసం గదిలో లైట్లు అన్ని ఆర్పివేయాలి. కర్టేన్లు మూసివేయాలి. గది మొత్తం చీకటి అయ్యాక ఫ్లాష్‌లైట్‌ ఆన్ చేయాలి. అప్పుడు ఆ గదిలో రహస్య కెమెరాలు ఉంటే అవి ఎరుపు లేదా ఆకుపచ్చ ఎల్‌ఈడీ రంగులో మెరుస్తాయి. దీంతో ఈ కెమెరాను పట్టేయవచ్చు. గూగుల్‌ ప్లె స్టోర్‌ లేదా యాపిల్‌ స్టోర్‌లో హిడెన్‌ కమెరా డిటెక్టర్‌ యాప్‌లు కూడా ఉన్నాయి. ఆ యాప్‌లు సీక్రెట్‌ కెమెరాలను స్కాన్ చేసి గుర్తించగలవు.

అయితే కొన్నిసార్లు సీక్రెట్ కెమెరాలు వైఫై నెట్‌వర్క్‌తో కూడా పనిచేస్తుంటాయి. అవి రికార్డ్‌ చేసే వీడియోను వైఫై ద్వారా ట్రాన్స్‌మిట్ చేస్తుంటాయి. అందుకే మీరు గదిలోకి వెళ్లాక అక్కడ వైఫై నెట్‌వర్క్స్‌ ఏవేవి ఉన్నాయో కూడా చూడండి. ఇందుకోసం WiFiman లేదా NetSpot వంటి నెట్‌వర్క్ స్కానర్ యాప్స్ కూడా వినియోగించవచ్చు. ఏదైనా అనుమానస్పద నెట్‌వర్క్ కనిపిస్తే.. దానిపై హోటల్‌ యాజనాన్యాన్ని ప్రశ్నించవచ్చు. సీక్రెట్ కెమెరాలు డేటాను ప్రసారం చేస్తే.. అవి రేడియో ఫ్రీక్వెన్సీలను రిలీజ్ చేస్తాయి. RF డిటెక్టర్‌ యాప్‌లు ఈ సిగ్నల్స్‌ను గుర్తించడంలో సహాయపడతాయి. ప్రత్యేకించి RF డిటెక్టర్‌ డివైజ్‌లు కూడా బాగా పనిచేస్తాయి. RF సిగ్నల్స్‌ను గుర్తించే కొన్ని యాప్‌లు కూడా ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉన్నాయి. అయితే ఇవి నూటికి నూరు శాతం కచ్చితంగా పనిచేస్తాయని చెప్పలేం.

Also Read: ఫోన్ కూడా అవసరం లేదు.. జస్ట్ నవ్వండి అంతే పేమెంట్ అయిపోతుంది! ఎలా అంటే..

అలాగే రెస్ట్‌రూం, డ్రెస్ చేంజింగ్‌ రూమ్‌కు వెళ్లినప్పుడు ఆ గది మొత్తాన్ని జాగ్రత్తగా పరిశీలించింది. అక్కడ ఉండే అద్దాన్ని పరిశీలించండి. అద్దంపై మీ చేతివేలిన పెట్టండి. మీ వేలు, అద్దంలో కనిపించే వేలుకు కాస్త దురం అంటే అది సరైన అద్దం. ఒకవేళ మీ వేలు, అద్దంలో ఉన్న వేలు దగ్గరగా అతుక్కుని ఉన్నట్లు కనిపిస్తే అందులో సీక్రెట్ కెమెరా ఉండే అవకాశం ఉంటుంది. కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు మహిళలు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఒకవేళ మీరు సీక్రెట్ కెమెరా ఉన్నట్లు గుర్తిస్తే.. దాన్ని టచ్‌ చేయకండి. ఎందుకంటే పోలీసులు దానిపై ఉండే ఫింగర్‌ప్రింట్స్‌తో నేరస్తులను పట్టుకోవచ్చు. ఆధారం కోసం ఆ సీక్రెట్‌ కెమెరాను ఫొటో తీసి.. పోలీసులకు లేదా అక్కడ ఉండే ఇతర అధికారులకు కాల్ చేసి చెప్పండి.

Advertisment
Advertisment
తాజా కథనాలు