నేడు ప్రజాగాయకుడు గద్దర్ అంత్యక్రియలు.. ఎల్బీ స్టేడియం నుంచి అంతిమయాత్ర!

ప్రజాగాయాకుడు గద్దర్ మరణం ప్రజలను తీవ్రంగా కలిచివేసింది. బీటెక్ చదివిన గద్దర్ విప్లవ బాట పట్టడం.. ఆ తర్వాత నక్సలైట్ ఉద్యమంలో కీలక పాత్ర పోషించడం, 1969 తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొనడం ఇలా ఏం చేసినా అది గద్దర్‌కే చెల్లింది. 1997 ఏప్రిల్ 6న గద్దర్‌పై పోలీసుల కాల్పులు జరపగా.. శరీరంలోకి బుల్లెట్లు చొచ్చుకెళ్లాయి. దాదాపు అన్ని బుల్లెట్లను తొలగించిన వైద్యులకు.. ఓ బుల్లెట్‌ని మాత్రం తొలగించలేకపోయారు. ఆయన శరీరంలో ఇప్పటికీ ఆ బుల్లెట్ అలానే ఉండగా.. తాజాగా హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడవడాన్ని ప్రజలు జీర్ణించుకోలేపోతున్నారు.

New Update
నేడు ప్రజాగాయకుడు గద్దర్ అంత్యక్రియలు.. ఎల్బీ స్టేడియం నుంచి అంతిమయాత్ర!

Folk Singer Gaddar Last Rites Today : హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ప్రజాగాయకుడు గద్దర్ (Gaddar) అంత్యక్రియలు నేడు (ఆగస్టు 7) మధ్యాహ్నం 12 గంటలకు జరగనున్నాయి. ఎల్బీ స్టేడియం నుంచి అంతిమయాత్ర ఉంటుంది. అల్వాల్‌లో గద్దర్‌ స్థాపించిన స్కూల్‌లోనే అంత్యక్రియలు జరగనున్నాయి. ఇక ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. గద్దర్ ఆత్మకు శాంతి చేకూరలని ఆకాంక్షించారు. 1949లో మెదక్ జిల్లా తూప్రాన్‌లో గద్దర్ జన్మించారు. గద్దర్ తల్లిదండ్రులు లచ్చమ్మ, శేషయ్య. గద్దర్ అసలు పేరు గుమ్మడి విఠల్ రావు. నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌, హైదరాబాద్‌లో విద్యను పూర్తి చేశారు. తన పాటలతో ఉద్యమాలకు ఊపుతెచ్చారు. భావ వ్యాప్తి కోసం ఊరురా తిరిగారు. ప్రచారం కోసం బుర్ర కథ ఎచ్చుకున్నారు ప్రజా గాయకుడు. 1969 తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. గద్దర్ ప్రదర్శనను చూసిన దర్శకుడు నరసింగరావు భగత్ సింగ్..సినిమా అవకాశం ఇచ్చారు. 1971లో ఆపర రిక్షా అనే పాటను రాశారు. ఆయన మొదటి ఆల్బం పేరు గద్దర్. అదే పేరుతో స్థిరపడ్డారు.

పోరాట యోధుడు:
2010 వరకు నక్సలైట్ ఉద్యమంలో( Naxalite movement)  కీలక పాత్ర పోషించారు గద్దర్. 1972లో జన నాట్య మండలి ఏర్పాటు చేశారు. 1975లో బ్యాంకు రిక్రూట్మెంట్ పరీక్ష రాసి..కెనరా బ్యాంక్‌లో క్లార్క్‌గా చేరారు. ఆ తర్వాత వివాహం చేసుకున్నారు గద్దర్. ఆయన భార్య పేరు విమల, ముగ్గురు పిల్లలు ఉన్నారు. మా భూమి సినిమాలో సాయుధ పోరాట యోధుడు యాదగిరి పాత్రలో నటించి..బండెనక బండి కట్టి అనే పాటను ఆయనే పాడి..ఆడారు. 1984లో ఉద్యోగానికి రాజీనామా చేశారు. 1985లో కారంచేడులో దళితుల హత్యలకు వ్యతిరేకంగా పోరాటం చేశారు ప్రజాగాయకుడు.

అవార్డును తిరస్కరించిన గద్దర్:
మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, బీహార్ రాష్ట్రాల్లో ప్రదర్శనలు ఇచ్చారు. మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి హయాంలో నక్సలైట్లపై ఉదారంగా వ్యవహరించారు. 1990 ఫిబ్రవరి 18న నిజాం కాలేజీలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఇందులో లక్షల మంది హాజరయ్యారు. 1997 ఏప్రిల్ 6న గద్దర్‌పై పోలీసులు కాల్పులు జరిపారు. దీంతో ఆయన శరీరంలోకి బుల్లెట్లు చొచ్చుకెళ్లాయి. అన్ని బుల్లెట్లను తొలగించిన వైద్యులు..ఓ బుల్లెట్ తొలగించలేకపోయారు. అది తొలగిస్తే ప్రాణాలకే ప్రమాదమని వైద్యులు తెలిపారు. ఆయన ఒంట్లో ఇప్పటికీ బుల్లెట్ ఉంది. గద్దర్‌ రాసిన పాటల్లో అమ్మ తెలంగాణమా అనే పాట మంచి ప్రజాదరణ పొందింది. నీ పాదం మీద పుట్టు మచ్చ నై చెల్లెమ్మ అనే పాటకు ఉత్తమ గీతంగా నంది అవార్డు దక్కించుకున్నారు. ఐతే అవార్డును గద్దర్ తిరస్కరించారు. జైబోలో తెలంగాణ సినిమాలోనూ కనిపించారు. పొడుస్తున్న పొద్దూ మీద అనే పాట రాసి అభినయించారు. ఇటీవల ఖమ్మంలో జరిగిన రాహుల్‌ సభలోనూ గద్దర్ మెరిశారు.

Also Read: ప్రజాగాయకుడు గద్దర్ అంత్యక్రియలపై వివాదం

Advertisment
Advertisment
తాజా కథనాలు