FlipKart: వందల మంది ఉద్యోగుల పై ఫ్లిప్‌కార్ట్‌ వేటు!

ఫ్లిప్‌కార్ట్‌ మరోసారి తన ఉద్యోగుల మీద వేటు వేసింది. మొత్తం ఉద్యోగుల్లో 5 నుంచి 7 శాతం మంది ఉద్యోగుల పై కంపెనీ ఉద్వాసన పలకనున్నట్లు తెలుస్తుంది. ఈ ప్రక్రియను ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌ లోపు పూర్తి చేసే ఆలోచనలో ఉన్నట్లు కంపెనీ వివరించింది.

Flipkart : ఫ్లిప్ కార్ట్ సమ్మర్ కూల్ సేల్..ఏసీ, ఫ్యాన్లు, రిఫ్రిజిరేటర్లపై అదిరే ఆఫర్లు..!
New Update

Layoff: గత రెండు సంవత్సరాల నుంచి ప్రముఖ టెక్‌ కంపెనీలు(Tech Companies) అన్ని కూడా తమ ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు ఉద్యోగుల (Employees)  పై వేటు వేస్తూనే ఉన్నాయి. గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌ , ఫ్లిప్‌కార్ట్‌(FlipKart) వంటి ప్రముఖ కంపెనీలు ఇప్పటికే భారీ సంఖ్యలో తమ ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి.

మరోసారి వేటు...

ఇప్పటికే వేల సంఖ్యలో ఉద్యోగులను కంపెనీ నుంచి తొలగించిన ఫ్లిప్‌కార్ట్‌ మరోసారి తన ఉద్యోగుల మీద వేటు వేసింది. మొత్తం ఉద్యోగుల్లో 5 నుంచి 7 శాతం మంది ఉద్యోగుల పై కంపెనీ ఉద్వాసన పలకనున్నట్లు తెలుస్తుంది. ఈ ప్రక్రియను ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌ లోపు పూర్తి చేసే ఆలోచనలో ఉన్నట్లు కంపెనీ వివరించింది.

ఖర్చులను తగ్గించుకునే క్రమంలోనే గత ఏడాది నుంచి కూడా ఫ్లిప్‌కార్ట్‌ తాజా నియామకాలను కూడా నిలిపివేసింది. రెండు సంవత్సరాల నుంచి కూడా కంపెనీ సామర్ధ్యాన్ని బట్టి ఉద్యోగుల పై వేటు వేయడంతో పాటు ప్రతి సంవత్సరం కొందరు ఉద్యోగులను తొలగిస్తూ వస్తుంది కూడా. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌ కంపెనీలో 22 వేల మంది ఉద్యోగులు ఉండగా వారిని వివిధ విభాగాల్లో వారిని వినియోగించుకుంటూ 5 నుంచి 7 శాతం సిబ్బందిని తీసివేయాలని ఫ్లిప్‌కార్ట్‌ ప్రణాళికలు సిద్దం చేస్తోంది.

పేటీఎం, అమెజాన్‌,మీషో వంటి పలు కంపెనీలు ఇటీవల ఇదే తరహా ఖర్చు తగ్గింపు చర్యలను చేపడుతున్నాయి. గతేడాది మొత్తం లాభనష్టాలను చవిచూసిన ఫ్లిప్‌కార్ట్‌ నిలకడైన వృద్ది కోసం దృష్టి పెట్టింది. ఈ-కామర్స్ పరిశ్రమలో దీర్ఘకాలిక వృద్ధిపైన ఆయా కంపెనీలు దృష్టి పెడుతున్నాయి.

Also read: రేపు ఎన్నికల సంఘాన్ని కలవనున్న చంద్రబాబు-పవన్‌ కల్యాణ్‌!

#flipkart #layoffs
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe