Flipkart: మళ్ళీ కళ్ళు చెదిరే బిగ్ సేల్ తో వచ్చేస్తున్న ఫ్లిప్ కార్ట్

ఈసారి పండుగలు వరుసగా ఉన్నాయి. ఎక్కువ గ్యాప్ లేకుండా ఒకదాని తర్వాత ఒకటి వచ్చేస్తున్నాయి. దానికి తగ్గట్టే అన్ని ఈ కామర్స్ సంస్థలూ ఆఫర్లను కూడా ప్రకటించేస్తున్నాయి. మొన్నటి వరకు బిగ్ బిలియన్ డేస్ అంటూ ఆఫర్లు, డిస్కౌంట్ల వర్షం కురిపించిన ఫ్లిప్ కార్ట్ ఇప్పుడు మరో సేల్ తో వినియోగదారుల ముందు వచ్చేస్తోంది. నవంబర్ 2 నుంచి దీవాళీ సేల్ ను నిర్వహించనున్నట్లు ప్రకటించేసింది ఫ్లిప్ కార్ట్.

New Update
Flipkart: మళ్ళీ కళ్ళు చెదిరే బిగ్ సేల్ తో వచ్చేస్తున్న ఫ్లిప్ కార్ట్

Flipkart Big Diwali Sale: దసరా అయిపోయింది. దీపావళి వచ్చేస్తోంది. మొన్నటి వరకు బిగ్ బిలియన్ డేస్ తో ఆఫర్ల వర్షం కురిపించిన ఫ్లిప్ కార్ట్ (Flipkart) ఇప్పుడు దీవాళీ బంపర్ బొనాంజాను అందించడానికి రెడీ అయిపోయింది. ఫ్లిప్ కార్ట్ బిగ్ దీవాళీ సేల్ ను త్వరలోనే ప్రారంభించనుంది. మరో రెండు రోజుల్లో అంటే నవంబర్ 2 నుంచి దీవాళీ సేల్ మొదలవుతుంది. నవంబర్ 11 వరకు ఇది కొనసాగుతుంది. దసరా బిగ్ బిలియన్ డేస్ (Big Billion Days) లానే దీవాళీ బిగ్ సేల్ లో కూడా భారీ ఆఫర్లను ఇవ్వడానికి రెడీ అయింది ఫ్లిప్ కార్ట్.

Also read:విజయనగరం రైలు ప్రమాదంలో పెరుగుతున్న మృతుల సంఖ్య

ఈ సేల్ లో ఎప్పటిలాగే స్మార్ట్ ఫోన్స్, ల్యాప్ ట్యాప్‌ల మీద బిగ్ డిస్కౌంట్స్‌ను ఇస్తున్నారు. స్మార్ట్ ఫోన్ల మీద 45 శాతం వరకు డిస్కౌంట్ లభించనుంది. ఇక స్మార్ట్ వాచీల మీద అయితే ఏకంగా 80 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. ల్యాప్ టాప్స్ విషయానికి వస్తే 50 శాతం వరకు డిస్కౌంట్ వస్తుందని తెలిపింది. దీంతో పాటు కోటక్ బ్యాంక్ కార్డుల మీద 10 శాతం, ఎస్బీఐ కార్డుతో కొనుగోలు చేసేవారికి 10 శాతం ఇన్స్టంట్ ఆఫర్ ఇవ్వనున్నారు. అలాగే ఫ్లిప్ కార్ట్ యాక్సెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే అదనంగా 5 శాతం క్యాష్ బ్యాక్ వస్తుంది. అలాగే యూపీఐ ట్రాన్సాక్షన్ల మీద కూడా ఆఫర్లు లభిస్తాయి.

ఇక దసరా కానుకగా ఫ్లిప్ కార్ట్ నిర్వహించిన సేల్ లో ఒకే రోజు ఏకంగా 1.4 బిలియన్ల మంది వినియోగదారులు ఆ ఈ కామర్స్ సైట్ ను సందర్శించారు. అక్టోబర్ 26 వరకు 1 బిలియన్ డాలర్ల వ్యాపారం జరిగిందని సంస్థ నిర్వాహకులు చెబుతున్నారు.

Also Read:పసిడి ప్రియులకు భారీ షాక్..ధరలకు రెక్కలోచ్చాయి!

Advertisment
తాజా కథనాలు