Flipkart: బిగ్ బిలియన్ డేస్ వచ్చేస్తున్నాయోచ్....ఆఫర్ల పండగే ఇంక

ఈ కామర్స్ దిగ్గజాలు వరుసపెట్టి ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. పండగ సీజన్లలో ఆఫర్ల హంగామా చేస్తున్నాయి. ఫ్లిప్ కార్ట్ కూడా తమ బిగ్ బిలియన్ డేస్ వివరాలను అనౌన్స్ చేసింది. అక్టోబర్ 8 నుంచి 15 వరకు బిగ్ బిలియన్ డేస్ అని ప్రకటించింది.

Flipkart: బిగ్ బిలియన్ డేస్ వచ్చేస్తున్నాయోచ్....ఆఫర్ల పండగే ఇంక
New Update

Flipkart Big Billion Days Sale: ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ (Flipkart) పండగ సీజన్ ను మోసుకొచ్చేస్తోంది. ఆఫర్లతో వినియోగదారులను ముంచెత్తడానికి రెడీ అయింది. అక్టోబర్ 8వ తేదీ నుంచి బిగ్ బిలయన్ డేస్ ఉంటాయని ప్రకటించింది. అక్టోబర్ 8 నుంచి 15వ తేదీ వరకు ఎనిమిది రోజుల పాటూ సేల్ ఉంటుంది. స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు, స్మార్ట్ వాచ్ లు, యాక్సెసరీస్, గృహోపకరణాలు, ఫ్యాషన్, బ్యూటీ ప్రోడక్ట్స్ మీద బోలెడు ఆఫర్లను మోసుకొస్తోంది ఫ్లిప్ కార్ట్.

ఈ సేల్ లో బిగ్గెస్ట్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్ పేరుతో ఫ్లిప్ కార్ట్ స్పెషల్ ఆఫర్లను ప్రకటించింది. మెయిన్ మొబైల్ ఫోన్ల మీద భారీగా ఆఫర్లు ఉంటాయని వెబ్ సైట్ లో తెలిపింది. ఎలక్ట్రానిక్స్, యాక్సెసరీస్ ల మీద 50 నుంచి 80 శాతం, టీవీ, హోమ్ అప్లయెన్స్ మీద 80 శాతం వరకు డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు తెలిపింది. హౌస్ హోల్డ్ బ్యూటీ, ఫ్యాషన్ ఉత్పత్తుల మీద 60 నుంచి 80 శాతం వరకూ డిస్కౌంట్స్ ఉంటాయని చెప్పింది.

ఇక ఈ బిగ్ బిలియన్ డేస్ సేల్ లో వివో (Vivo), శాంసంగ్ (Samsung), మోటోరోలాకు చెందిన ఆరు మోడల్స్ ఫోన్లు కొత్తవి విడుదల కానున్నాయి. అలాగే ఐఫోన్ (iPhone) 14 సీరీస్, ఐఫోన్ 13, గూగుల్ పిక్సెల్7, పిక్సెల్ 6 మోడల్స్ మీద కూడా సూపర్ డిస్కౌంట్ ఉంటుందని ఫ్లిప్ కార్ట్ సంస్థ ప్రకటించింది.

Also Read: ఆ బ్యాంక్ కస్టమర్లకు ఆర్బీఐ షాక్.. నగదు విత్ డ్రాపై ఆంక్షలు.. వివరాలివే!

#discounts #flipkart-big-billion-days-sale #big-billion-days #flip-kart #e-commerce #offers
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe