థాయ్‌లాండ్ నుండి UKకి వెళ్లే విమానాన్ని ఒక ప్రయాణికుడు విమానం బాత్రూంలో ఆత్మహత్యకు ప్రయత్నించడంతో అత్యవసరంగా ల్యాండింగ్ చేయవలసి వచ్చింది. బ్యాంకాక్ నుండి EVA ఎయిర్ ఫ్లైట్ BR67 శుక్రవారం లండన్ హీత్రూ ఎయిర్‌పోర్ట్‌లోకి దిగే క్రమంలో ఓ ప్రయాణికుడు బాత్రూం నుంచి ఎంతసేపటికీ బయటకు రాకపోవడాన్ని క్యాబిన్ సిబ్బంది గమనించారు.
దీంతో వారు బాత్రూం తలుపులు ఎంత కొట్టినప్పటికీ అతను తలుపు తీయకపోవడంతో సిబ్బందికి ఏదో అనుమానంగా అనిపించింది. వెంటనే తలుపులు తెరిచి చూడగా అతను ఆత్మహత్యకు పాల్పడుతూ కనిపించాడు.వెంటనే అతడిని బయటకు తీసుకుని వచ్చి విమాన సిబ్బందితో పాటు విమానంలో ఉన్న ఓ డాక్టర్ ఆ వ్యక్తికి ప్రథమ చికిత్స అందించారు.
ఈ క్రమంలో విమానం హిత్రూ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ అయ్యింది. ప్రయాణికుడిని తదుపరి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.అయితే దీని గురించి ఎయిర్ లైన్ సిబ్బంది ధృవీకరించింది కానీ ప్రయాణికుడి వివరాలను మాత్రం గోప్యంగా ఉంచింది.
Also read: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మూడురోజుల్లో భారీ వర్షాలు!