మెదక్ లో తీవ్ర విషాదం.. నీట మునిగి ఐదుగురి మృతి

ఉమ్మడి మెదక్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. వేరు వేరు గ్రామాలకు చెందిన ముగ్గురు యువకులు, ఇద్దరు బాలురు నీట మునిగి మరణించిన సంఘటనలు జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపాయి. ఇందులో ముగ్గురు చేపలు పట్టడానికి వెళితే, మరో ఇద్దరూ స్నానానికి వెళ్లి ఈత రాకపోవడంతో మృతిచెందారు.

మెదక్ లో తీవ్ర విషాదం.. నీట మునిగి ఐదుగురి మృతి
New Update

ఈత రాకపోవడంతో నీట మునిగి ఐదుగురు వ్యక్తులు చనిపోయిన సంఘటన ఉమ్మడి మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. పైడిగుమ్మల్ గ్రామంలో సరదాగా చేపలు వేటకు వెళ్లిన ముగ్గురు యువకులు అనుకోకుండా చెరువులో జారిపడి ప్రాణాలు కొల్పోతే, స్నానానికి వెళ్లిన ఇద్దరు బాలురు కాలువలో పడి మృతి చెందిన సంఘటన సిద్ధిపేట జిల్లా మర్కుక్ లో జరిగింది. అయితే ఇందులో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు చనిపోవడడంతో పైడిగుమ్మల్ గ్రామంలో విషాదం నెలకొంది.

ఈ మేరకు పోలీసులు తెలిపి వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లాలోని పైడిగుమ్మల్ గ్రామంలో, అన్నదమ్ముల పిల్లలైన చీమల మోహన్ (33), చీమల అంజయ్య (33) చేపలు పట్టడానికి గ్రామంలోనే ఉన్న చెరువులోకి దిగారు. అయితే వాళ్లకు ఈత రాకపోవడంతో చెరువులో మునిగి చనిపోయారు. అంజయ్య, మోహన్ ఇద్దరికీ కూడా పెళ్లిళ్లు అయ్యాయి, ఇద్దరికీ భార్య , ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒక కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఒకే రోజు చనిపోవడంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొన్నాయిని తెలిపారు. అలాగే ఈ నెల 23 చేపలు పట్టడానికి కాళేశ్వరం కాలువలోకి దిగిన ఒక వ్యక్తి సోమవారం శవమై తేలాడు. మెదక్ జిల్లాలోని నర్సాపూర్ మండలంలో రెడ్డిపల్లి గ్రామానికి చెందిన షేక్ మొహమ్మద్ (25), చేపలు పట్టడానికి అని ఇంటినుండి వెళ్ళాడు. అయితే ఆ రోజు నుంచి అతడు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు గ్రామస్థుల సహకారంతో వెతికి వెతికి, చివరికి పోలీస్ స్టేషన్ లో కంప్లైట్ ఇచ్చారు. సోమవారం మేకల కాసేవారికిశవం కాళేశ్వరం కాలువలో తేలుతుండటం గమనించి, కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. నాలుగు రోజులుగా నీటిలో ఉండటంతో, శవం పూర్తిగా కుళ్లిపోయినట్లు పోలీసులు వెల్లడించారు.

Also read :ఇలాంటి ట్రైలర్‌ నేను ఇప్పటివరకు చూడలేదు.. రణ్‌బీర్‌ను పొగిడేసిన ప్రిన్స్

ఇదిలా ఉంటే.. సిద్ధిపేట జిల్లా మర్కుక్ లో మరొక తీవ్ర విషాద సంఘటన చోటుచేసుకుంది. ఇద్దరు బాలురు ఈతకు వెళ్లి కాలువలో పడి మృతి చెందారు. ఆరుగురు విద్యార్థులు కలిసి ఈతకోసం కొండపోచమ్మ సాగర్ కాలువలో ఈతకని వెళ్లారు. వారికీ ఈత రాకపోవడం తో కాలువలో పడి ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. వీరు మర్కుక్ గ్రామానికి చెందిన సళ్ళ సంపత్ కుమార్ (12) మైసిగారి వినయ్ (11) గా గుర్తించారు. సంపత్ కుమార్ వాళ్ళ నాన్న పది సంవత్సరాల క్రితం పిడుగుపడి చనిపోయాడు, అప్పటినుండి తన తల్లి కనకవ్వ సంపత్, తన అన్నను కూలి పని చేసుకుంటూ సాదుకుంటుంది. ఈ క్రమంలో, ఇద్దరు కుమారుల్లో ఒకరు మృత్యువాత పడటంతో, కనకవ్వ అపస్మాకరక స్థితిలోకి వెళ్ళింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఇద్దరు బాలుర శవాలను కూడా నీటిలోనుడి బయటకు తీశారు. పోస్టుమార్టుమ్ చేసిన తర్వాత, అంత్యక్రియలు నిర్వహించారు.

#five-people #drowned #medak
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe