ఏపీలో వాగుదాటబోయి ముగ్గురు గల్లంతు.. వీడియో వైరల్
ముగ్గురు వ్యక్తులు వాగులో పడి కొట్టుకుపోయిన సంఘటన అల్లూరి జిల్లా అనంతగిరి మండలం భీంపోలు పంచాయతీలో చోటుచేసుకుంది. వాగు ప్రవాహం ఉధృతంగా ఉండటంతో వారిని కాపాడేందుకు స్థానికులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఒకరు మృతి చెందగా ఇద్దరి జాడ కోసం అధికారులు గాలిస్తున్నారు.