దీపావళి (Diwali) వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. లండన్ (london) లో భారత సంతతి (Indian origin family) కుటుంబానికి చెందిన ఐదుగురు కుటుంబ సభ్యులు అగ్నికి ఆహుతి అయ్యారు. చనిపోయిన వారిలో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. ఈ ప్రమాదంలో మరో వ్యక్తి కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఆదివారం రాత్రి జరిగింది.
ఈ ఘటన పై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అధికారులు మృతుల వివరాలను ఇంకా వెల్లడించలేదు. ఈ విషయం గురించి మెట్రో పాలిటన్ చీఫ్ పోలీస్ సీన్ విల్సన్ సంతాపం వ్యక్తం చేశారు. ఈ సంఘటనకు గల కారణాలను గురించి తెలుసుకుంటున్నట్లు ఆయన వివరించారు.
ముందు జాగ్రత్తగా చుట్టు పక్కల ప్రాంతాలను ఖాళీ చేయించినట్లు అధికారులు తెలిపారు. ఆదివారం రాత్రి హౌన్‌స్లో ప్రాంతంలోని ఛానెల్ క్లోజ్ నుంచి సమాచారం వచ్చినట్లు వారు వివరించారు. ఘటన గురించి తెలుసుకున్న వెంటనే సంఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది, అంబులెన్స్ లు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే అప్పటికే ఐదుగురు మరణించగా..మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
గాయపడిన వ్యక్తిని వెంటనే ఆసుప్రతికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతని పరిస్థితి మెరుగు పడినట్లు వైద్యులు వివరించారు. మృతి చెందిన వారు అంతా కూడా ఒకే కుటుంబానికి చెందిన వారిగా అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటన గురించి భారత సంతతికి చెందిన దిలీప్ అనే వ్యక్తి మాట్లాడుతూ.. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే అదే భవనంలో ఉన్న తన బావ ఉన్నారని చెప్పారు.
తనకు సమాచారం అందిన వెంటనే ఇక్కడకు వచ్చినట్లు ఆయన వివరించారు. అసలేం జరిగిందో తనకు తెలియదన్నారు. బాధిత కుటుంబం ఇటీవలే బెల్జియం నుంచి లండన్ లోని ఇంటికి మారినట్లు ఆయన తెలిపారు.
Also read: తిరుమలలో మళ్లీ చిరుత కలకలం.. అధికారులు ఏం చెబుతున్నారంటే?