Cyclone Alert: అలెర్ట్.. తుపాను ముప్పు.. ఏపీ, తెలంగాణకు వర్షాలు!
బంగాళాఖాతంలో ఏర్పడనున్న 'మిగ్జామ్' తుపాను కారణంగా డిసెంబర్ 3-4 తేదీల్లో ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. అటు తమిళనాడుకు మాత్రం ఈ తుపాను ఎఫెక్ట్ గట్టిగానే ఉండనుంది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని ఐఎండీ హెచ్చరించింది.