TS Weather Update: ఆ జిల్లాల ప్రజలకు అలర్ట్..వడగళ్ల వాన పడే ఛాన్స్..బయటకు రావొద్దంటున్న ఐఎండి.! తెలంగాణలో వాతావరణం ఒక్కసారి మారిపోయింది.నిప్పుల కొలమిలా రాష్ట్రాన్ని వరణుడు చల్లబరిచాడు. మరో ఐదు రోజులు ఇదే పరిస్థితి ఉండనుంది. ముఖ్యంగా 12 జిల్లాల్లో వడగళ్ల వానలుకురిసే అవకాశం ఉందని ప్రజలు బయటకు రావొద్దంటూ ఐఎండీ హెచ్చరించింది. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి. By Bhoomi 20 Apr 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి TS Weather Update: తెలంగాణలో ఉన్నట్టుండి ఒక్కసారిగా వాతావరణం పూర్తిగా మారిపోయింది. భానుడి భగభగలతో కొట్టుమిట్టాడిన తెలంగాణ ప్రజానీకానికి వరణుడు చల్లటి కబురందించాడు. ఎండల వేడిమి నుంచి తట్టుకునేలా చిరుజల్లులు కురిపించాడు. గురువారం సాయంత్రం నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు నమోదు అయ్యాయి. శుక్రవారం సాయంత్రం నిజామాబాద్, మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లాలో భారీగా వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీగా పంట నష్టం వాటిల్లింది. ఓ ఇల్లుపై పిడిగుపడింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈదురుగాలులకు ఇంటి పైకప్పులు ఎగిరిపోయాయి. ఈ వర్షాలు మరో ఐదురోజుల పాటు కొనసాగనున్నట్లు వాతావరణశాఖ తెలిపింది.ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని పలు జిల్లాలను హెచ్చరించింది హైదరాబాద్ లోని వాతావరణ శాఖ. ఇక తెలంగాణలోని 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, మహబూబ్ నగర్, ఖమ్మం, హన్మకొండ, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఆదివారం ఉదయం వరకు ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. అంతేకాదు వడగళ్ల వాన కురవడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. దీంతో ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఆదివారంనాడు మంచిర్యాల, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు పడతాయని యెల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.సోమవారం కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజ్‌గిరి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో మోస్తరు వానలు కురిసే అవకాశముందని తెలిపింది. మంగళవారం మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో వానలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఇది కూడా చదవండి: రైతులకు గుడ్ న్యూస్..వారి ఖాతాల్లో రూ. 10వేలు జమ..పూర్తి వివరాలివే.! #telangana-news #ts-rains #ts-weather-update #rains-update మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి