/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-18-1-jpg.webp)
Rishabh Pant: రోడ్డు యాక్సిడెంట్ కారణంగా గత ఏడాది కాలంగా క్రికెట్ ఫీల్డ్ కు దూరంగా ఉంటున్న టీమిండియా స్టార్ వికెట్ కీపర్ అండ్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ రీ ఎంట్రీపై ఉత్కంఠ నెలకొంది. ఫిట్ నెస్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్న రిషబ్ ఎప్పటికప్పడూ తన కసరత్తులకు సంబంధించిన వీడియోలను క్రికెట్ లవర్స్ తో షేర్ చేసుకుంటున్నాడు. అయితే జూన్ లో టీ20 వరల్ట్ కప్ టోర్నీతోపాటు త్వరలోనే ఐపీఎల్ కూడా రాబోతుంది. ఈ తరుణంలో రిషబ్ పునారగమనం కోసం అభిమానులతో పాటు టీమ్ మేనేజ్‌మెంట్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
One step forward
One step stronger
One step better pic.twitter.com/uMiIfd7ap5— Rishabh Pant (@RishabhPant17) February 10, 2023
ఫిట్‌నెస్ క్లియరెన్స్..
ఈ క్రమంలోనే భారత మాజీ ఆటగాడు, ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న సౌరవ్ గంగూలీ దీనిపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చారు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో గంగూలీ మాట్లాడుతూ.. ‘అతను ఫిట్‌గా ఉన్నట్లు ప్రకటించుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేశాడు. అందుకే నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA) అతనికి ఫిట్‌నెస్ క్లియరెన్స్ ఇస్తుంది. రిషబ్ పంత్ ఫిట్‌నెస్ పరీక్ష మార్చి 5న జరగనుంది. దీని తర్వాత మాత్రమే మేము పంత్ కెప్టెన్సీ కోసం బ్యాకప్ ఎంపికను పరిశీలిస్తాం. దీనిపై పెద్దగా హైప్ సృష్టించట్లేదు. అతని ఫిట్‌నెస్ క్లియరెన్స్ కోసం ఎదురుచూస్తున్నాం’ అని వివరించారు.
ఇది కూడా చదవండి:Maheshbabu: డీజే టిల్లుగా మారిన ప్రిన్స్.. రాధికతో అదే రచ్చ!
ప్రత్యాన్మయాలున్నాయి..
అలాగే పంత్ కీపింగ్ బాధ్యతలు నిర్వర్తించడంపై కూడా స్పందిస్తూ.. ‘పంత్ ఎలా చేస్తాడో చూడాలి. అతను ఫిట్‌నెస్ పరీక్షలో పాసైతేనే ఢిల్లీ క్యాపిటల్స్ క్యాంపులో చేరగలడు. ఇప్పుడే మేము అంచనా వేయలేం. కుమార్ కుషాగ్రా, రికీ భుయ్, షాయ్ హాప్, ట్రిస్టన్ స్టబ్స్ వంటి అద్భుతమైన ప్రత్యాన్మయాలున్నాయన్నాడు. అయితే రిషబ్ ఈ టెస్ట్ లో ఫెయిల్ అయితే అభిమానులకు నిరాశ తప్పదు. మెగా టోర్నీకి రిషబ్ దూరం కావడం ఫ్యాన్స్ జీర్ణించుకోలేరు. ఇప్పటికే 2023 వలర్డ్ కప్ ఆడకపోవడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందారు.
Follow Us