US Lunar Lander: 50 ఏళ్ల తర్వాత చంద్రునిపై మానవయాత్రకు సిద్ధమైన అమెరికా

దాదాపు 50 ఏళ్ల తర్వాత జాబిల్లి పైకి మరోసారి మానయయాత్ర చేపట్టేందుకు అగ్రరాజ్యం అమెరికా సిద్ధమవుతోంది. ఇందుకోసం ఈ ఏడాది చివర్లో నాసా.. ఆర్టెమిస్-2 ప్రయోగం చేపట్టనుంది. ఫ్లోరిడాలోని సోమవారం ఉదయం ల్యాండర్‌ను నాసా శాస్త్రవేత్తలు విజయవంతంగా ప్రయోగించారు.

New Update
US Lunar Lander: 50 ఏళ్ల తర్వాత చంద్రునిపై మానవయాత్రకు సిద్ధమైన అమెరికా

US Moon Lunar Lander: చంద్రునిపై ఉన్న రహస్యాలు తెలుసుకునేందుకు నిత్యం పరిశోధనలు జరుగుతూనే ఉంటాయి. కొన్ని దశాబ్దాల నుంచి వివిధ దేశాలు చంద్రునిపైకి తమ ల్యాండర్లను పంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో కొన్ని సక్సెస్ అయ్యాయి మరికొన్ని విఫలం అయ్యాయి. అయితే 50 ఏళ్ల క్రితం అమెరికా అపోలో 11 (Apollo 11) మిషన్‌తో మానవులను చంద్రునిపైకి పంపిన సంగతి తెలిసిందే. అప్పట్లో జాబిల్లి పైకి మనుష్యులను పంపి ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరిచింది అమెరికా. ఆ తర్వాత మళ్లీ ఇంతవరకూ ఎవరూ కూడా చంద్రునిపై అడుగు పెట్టలేదు.

50 ఏళ్ల తర్వాత రెండోసారి
అయితే ఇప్పుడు జాబిల్లి పైకి మరోసారి మానయయాత్ర చేపట్టేందుకు అగ్రరాజ్యం అమెరికా సిద్ధం అవుతోంది. ఇందుకోసం ఈ ఏడాది చివర్లో నాసా.. ఆర్టెమిస్-2 ప్రయోగం చేపట్టనుంది. ఈ సన్నహాల్లో భాగంగా ఓ కీలక మిషన్‌ను నిర్వహించింది. సోమవారం ఉదయం లూనార్ ల్యాండర్‌ను ప్రయోగించింది. దాదాపు 50 సంవత్సరాల తర్వాత మళ్లీ అమెరికా మానవులను జాబిల్లి పైకి పంపేందుకు సిద్ధం కావడం మరోసారి ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. అమెరికా పంపనున్న పెరిగ్రీన్ ల్యాండర్‌ను ఆస్ట్రోబోటిక్ టెక్నాలజీస్ (Astrobotic Technologies) అనే సంస్థ అభివృద్ధి చేసింది.

Also Read: లక్షద్వీప్‌తో మాల్దీవులకు వచ్చిన సమస్య ఏంటీ.. స్థానిక ఎంపీ సంచలన వ్యాఖ్యలు..

భారత్ పరిస్థితి ఏంటీ
ఫ్లోరిడాలోని సోమవారం ఉదయం ఈ ల్యాండర్‌ను నాసా శాస్త్రవేత్తలు విజయవంతంగా ప్రయోగించారు. యూనైటెడ్ లాంచ్ అలియన్స్‌కు చెందిన వల్కన్ అనే రాకెట్ (Vulcan Rocket) ఈ ల్యాండర్‌ను తీసుకొని నింగిలోకి దూసుకెళ్లింది. అంతా సక్రమంగా జరిగితే ఈ ల్యాండర్‌ ఫిబ్రవరి 23న చందమామ ఉపరితలంపై దిగనుంది. ఇదిలాఉండగా.. భారత్‌ కూడా 2040 నాటికి మానవులను జాబిల్లి పైకి పంపాలని లక్ష్యం పెట్టుకుంది. అలాగే 2035 నాటికి ప్రత్యేక స్పెస్ స్టేషన్‌ కూడా నిర్మించే దిశగా ముందుకు సాగుతోంది. ఇక భవిష్యత్తులో చంద్రునిపై ఎలాంటి పరిశోధనలు జరుగుతాయో.. ఇంకా ఏఏ దేశాలు అక్కడికి మానవులను పంపుతాయో అనేది ఆసక్తిగా మారింది.

Also Read: అలెర్ట్…గూగుల్ అకౌంట్ పాస్ వర్డ్ లేకపోయినా హ్యాక్ చేస్తున్న హ్యాకర్లు

Advertisment
తాజా కథనాలు