VandeBharat: వందేభారత్ స్లీపర్ తొలి రైలు ఈ రూట్‌లోనే!

వందే భారత్‌ స్లీపర్‌ రైళ్లను త్వరలోనే పట్టాలెక్కించేందుకు రైల్వే శాఖ వేగంగా ముందుకు కదులుతుంది.ఈ స్లీపర్‌ రైలును ఆగస్టులోనే ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకుని వచ్చేందుకు రంగం సిద్దం చేస్తోంది.తొలి వందేభారత్ స్లీపర్ రైలు సిక్రింద్రాబాద్ - ముంబై నగరాల మధ్య నడిపే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

VandeBharat: వందేభారత్ స్లీపర్ తొలి రైలు ఈ రూట్‌లోనే!
New Update

VandeBharat: వందే భారత్‌ స్లీపర్‌ రైళ్లను త్వరలోనే పట్టాలెక్కించేందుకు రైల్వే శాఖ వేగంగా ముందుకు కదులుతుంది. ఈ స్లీపర్‌ రైలును ఆగస్టులోనే ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకుని వచ్చేందుకు రంగం సిద్దం చేస్తోంది. ఇందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే పరిధి నుంచి తొలి వందేభారత్ స్లీపర్ రైలు సిక్రింద్రాబాద్ - ముంబై నగరాల మధ్య నడిపే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

ఇప్పటివరకూ ఈ నగరాల మధ్య రైళ్లు లేనందున తొలి స్లీపర్ రైలు ఈ మార్గంలోనే నడపాలని కేంద్ర గనుల శాఖ మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ జి. కిషన్ రెడ్డి దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌కు ఈ విషయం గురించి తాజాగా తెలియజేశారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే జోన్, రైల్వే బోర్డుకు ప్రతిపాదనలు పంపాలని నిర్ణయించినట్టు తెలిసింది.

మరోవైపు సికింద్రాబాద్ - పుణెల మధ్య నడుస్తున్న శతాబ్ది ఎక్స్‌ప్రెస్ స్థానంలో వందేభారత్ రైలు (చైర్ కార్) రానున్నట్టు మరో సమాచారం.

Also read: రైల్వే శాఖ కీలక నిర్ణయం…ఇక నుంచి అలా చేస్తే జరిమానా తప్పదు!

#mumbai #secunderabad #sleeper-coach #vandebharat
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe