/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-16T181925.139-jpg.webp)
Kubera: క్లాసికల్ డైరెక్టర్ శేఖర్ ఖమ్ముల (Shekhar Kammula), తమిళ నటుడు ధనుష్ (Dhanush) కలయికలో వస్తున్న 'కుబేర'నుంచి సాలిడ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. మోస్ట్ క్రేజీయెస్ట్ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న సినిమా నుంచి హీరో ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. పాత బట్టలు, చెదిరిన జుట్టు, మాసిన గడ్డంతో కనిపించిన ధనుష్.. శివపార్వతుల గుడి ముందు నవ్వుతూ కనిపించాడు.
#Dhanush in #Kubera - a #shekharkammula film @dhanushkrajapic.twitter.com/Ogmlx1INEm
— Latha Srinivasan (@latasrinivasan) April 16, 2024
ఇది కూడా చదవండి:Keerthy Suresh: ఫ్యాన్స్ కు ఊహించని షాక్ ఇచ్చిన నటి.. పెళ్లి పోస్ట్ వైరల్!
లవ్‌స్టోరీ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత..
ఇక ఈ లుక్ చూసిన ఫ్యాన్స్ ఉలిక్కిపడుతున్నారు. ధనుష్ అవతారంపై భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు. శేఖర్ కమ్ముల ఈ సారి ధనుష్‌తో ఏదో భారీ ప్లాన్ చేశాడంటూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు. ఈ సినిమాలో రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. అక్కినేని నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నాడు. లవ్‌స్టోరీ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉండగా.. ఏషియన్ సినిమాస్ బ్యానర్‌పై సునీల్ నారంగ్, పీ రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.
A blockbuster voyage that's bound to resonate with the nation! 😎#DNS kicks off with a pooja ceremony and the shoot begins with a key schedule 🎥
More details on the way ⏳@dhanushkraja@iamnagarjuna@iamRashmika@sekharkammula@AsianSuniel@puskurrammohan@SVCLLPpic.twitter.com/bYBtyuwfGA
— Sree Venkateswara Cinemas LLP (@SVCLLP) January 18, 2024