Hyderabad : హైదరాబాద్ లో మరోసారి కాల్పుల కలకలం హైదరాబాద్ లో మరోసారి పోలీసుల తుపాకీలు మోగాయి.నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద తెల్లవారుజామున పోలీసులు కాల్పులు జరపడంతో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. రైల్వే స్టేషన్ సమీపంలో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులపై అనుమానిత వ్యక్తి దాడికి యత్నించడంతో ఈ ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు. By Bhavana 12 Jul 2024 in క్రైం తెలంగాణ New Update షేర్ చేయండి Telangana : హైదరాబాద్ (Hyderabad) లో మరోసారి పోలీసుల తుపాకీలు మోగాయి. కేవలం వారం రోజుల వ్యవధిలోనే రెండు వరుస ఘటనలు జరగడం నగర వాసులను కలవర పెడుతున్నాయి. నాంపల్లి రైల్వే స్టేషన్ (Nampally Railway Station) వద్ద తెల్లవారుజామున పోలీసులు కాల్పులు జరపడంతో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. రైల్వే స్టేషన్ సమీపంలో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులపై అనుమానిత వ్యక్తి దాడికి యత్నించడంతో ఈ ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు. ప్రధాన మార్గంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో ప్రయాణికులు , ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. ఇటీవలి కాలంలో హైదరాబాద్‌లో తుపాకీ కాల్పులు (Gun Fire) చోటు చేసుకోవడం ఇది నాలుగోసారి. కొద్ది రోజుల క్రితం ఎల్‌బి నగర్ సమీపంలో కూడా పార్దీ ముఠాపై పోలీసులు కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే నాంపల్లి ఘటనలో గాయపడిన వ్యక్తి ఎవరనేది గుర్తించాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనలో ఆ వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో ఉస్మానియా ఆస్పత్రి (Osmania Hospital) కి తరలించి చికిత్స అందిస్తున్నారు. అనుమానిత వ్యక్తి అపస్మారక స్థితిలో ఉండటంతో వివరాలు తెలియలేదని పోలీసులు చెబుతున్నారు. కాల్పుల్లో గాయపడిన వ్యక్తి వివరాలను కాసేపట్లో వెల్లడిస్తామని చెబుతున్నారు. తనిఖీలు చేస్తుండగా పోలీసులపై దాడికి ప్రయత్నించడంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే కాల్పులు జరిపినట్టు సమాచారం. Also read: వందేభారత్ స్లీపర్ తొలి రైలు ఈ రూట్‌లోనే! #telangana #hyderabad #gun-fire #nampally-railway-station మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి